పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే.. అక్కడే కొనుగోలు చేశారా?

పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే అక్కడే కొనుగోలు చేశారా?

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Icon Star Allu Arjun ) నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) సంచలన విజయాన్ని సొంతం చేసుకొని ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే.

పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే అక్కడే కొనుగోలు చేశారా?

ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.

పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే అక్కడే కొనుగోలు చేశారా?

ఈనెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా మేనియానే కనిపిస్తోంది.

పుష్ప సినిమాలో హీరో అర్జున్ మేనరిజాన్ని ఆయన అభిమానులు ఫాలో అవుతున్నారు.మరి ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగులు చెప్పే సమయంలో అల్లు అర్జున్ ధరించిన కాస్ట్యూమ్స్ పై( Pushpa 2 Costumes ) అందరి దృష్టిపడింది.

"""/" / పోలీస్‌ ఆఫీసర్‌ బన్వర్‌సింగ్‌ షెకావత్‌తో.పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకొన్నావా, పుష్ప అంటే వైల్డ్‌ ఫైర్‌ అనే డైలాగ్‌ చెప్పినప్పుడు, అలాగే హీరో అల్లు అర్జున్‌ బీరపువ్వు రంగు ఇక్కత్‌ సీకో పట్టు షర్ట్‌ ధరించాడు.

అయితే ఈ ఇక్కాత్ పట్టు వస్త్రం పోచంపల్లి చేనేత కార్మికులు( Pochampally Handloom Weavers ) నేసినదే.

ఇపుడు మార్కెట్‌ లో అల్లు అర్జున్‌ ధరించిన ఇక్కత్‌ డిజైన్‌ చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి.

భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యానికి ప్రతీక పోచంపల్లి చేనేత వస్త్రాలు.ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళుకులీనుతున్నాయి.

ఈ ఇక్కత్ వస్త్రాలు( Ikkat Dresses ) ఫ్యాషన్‌ ప్రియులు, డిజైనర్లను ఆకట్టుకుంటాయి.

దీంతో వీటికి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోయింది. """/" / కాగా పుష్ప 2 సినిమా కాస్ట్యూమ్స్ డిజైనర్ పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన ఇక్కత్‌ పట్టుతో డిజైన్ చేసిన షర్ట్ ను అల్లు అర్జున్‌ ధరించాడు.

కాగా పుష్ప 2 సిని మా షూటింగ్‌ను పోచంపల్లిలో మూడు రోజుల పాటు నిర్వహించారు.

ఆ సందర్భంగా పోచంపల్లికి వచ్చిన చిత్రం యూనిట్‌ ఇక్కత్‌ వస్త్రాలను కొనుగోలు చేశారని పోచంపల్లి వస్త్ర వ్యాపారులు తెలిపారు.

తామనేసిన ఇక్కత్ సికో పట్టు వస్త్రాన్ని హీరో అల్లు అర్జున్ ధరించడం పట్ల చేనేత కార్మికుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో వీటిని విక్రయాలు చేస్తున్నారు.ఈ విషయాలు తెలిసిన తర్వాత వాటిని ఎక్కువ శాతం మంది కొనుగోలు చేస్తున్నారు.

వావ్, అప్సరసలాంటి యూరోపియన్ అమ్మాయిని ప్రేమలో పడేసిన ఇండియన్ కోడర్.. వీడియో వైరల్!