ఎంతో పవిత్రమైన రావిచెట్టుకు ఎప్పుడు పూజలు చేయాలో తెలుసా?

హిందువులు ఎంతో పవిత్రమైన మొక్కలుగా భావించే వాటిలో రావి చెట్టు ఒకటి.రావిచెట్టును సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపంగా భావిస్తారు.

ఈ క్రమంలోనే రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

ఎంతో పవిత్రమైన ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు.

అయితే ఈ పవిత్రమైన చెట్టును పూజించడానికి పలువురికి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ చెట్టును తాకుతూ పూజ చేయవచ్చా? ఈ వృక్షాన్ని పూజించడానికి అనువైన సమయం ఏది అనే సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.

మరి రావి చెట్టును ఏ సమయంలో తాకకూడదు ఈ చెట్టుకు ఎప్పుడు పూజలు చేయాలి అనే విషయానికి వస్తే.

పురాణాల ప్రకారం రావి చెట్టును ఏ విధంగా పూజించాలి అనే విషయాలను నారద మహర్షి వివరించినట్లు తెలుస్తోంది.

రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీస్నానమాచరించి కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి.

అయితే రావిచెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకుని ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి.

రావిచెట్టుకు ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్ర నామాలను చదువుతూ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.

రావి చెట్టును తాకుతూ ప్రదక్షిణలు చేయకుండా ప్రతి ప్రదక్షిణం అనంతరం నమస్కరిస్తూ ప్రదక్షణ చేయాలి.

"""/" / ముఖ్యంగా ఈ పవిత్రమైన వృక్షానికి ప్రతి రోజూ పూజలు చేసినప్పటికీ ఆదివారం, మంగళవారం ప్రతిరోజు సంధ్యాసమయంలో ఈ చెట్టును తాకకూడదు.

కేవలం శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలను తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా సంతానం లేని వారు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి నిత్యం పూజ చేయటం వల్ల వారికి సంతానయోగం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

ఆ సినిమా కథ చెబితే తెలుగు హీరోలందరూ రిజెక్ట్ చేశారు: వెంకీ అట్లూరి