బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!

సాధారణంగా శిశువు పుట్టగానే వారికి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఆహారంగా ఇస్తారు.

అయితే శిశువుకు ఆరు నెలలు రాగానే వారికి చేసే కార్యక్రమం అన్నప్రాసన కార్యక్రమం.

ఈ అన్నప్రాసన చేయడం ద్వారా వారు తొలిసారిగా అన్నం తీసుకుంటారు కాబట్టి కొందరు ఆరు నెలల్లో అన్నప్రాసన కార్యక్రమం చేస్తారు.

అయితే ఆడపిల్లకు ఐదు లేదా ఏడవ నెలలో అన్నప్రాసన కార్యక్రమం చేస్తారు.అదేవిధంగా అబ్బాయికి 6 లేదా ఎనిమిదవ నెలలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

అయితే పుట్టిన బిడ్డకు ఏ సమయంలో అన్నప్రాసన కార్యక్రమం చేయాలి? ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా పుట్టిన శిశువులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఉత్తరాయణంలో శుక్లపక్ష తిథులలో మాత్రమే జరిపించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.

అదేవిధంగా శిశువుకు పెట్టే ఆహారంలో తప్పనిసరిగా ఆవుపాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, బెల్లం వంటి పదార్థాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ఈ అన్నప్రాసన కార్యక్రమం చేసేటప్పుడు శుభముహూర్తాన తల్లిదండ్రులు ఆయురారోగ్యాల కొరకు సంకల్పం చెప్పుకొని వినాయకుడిని పూజించుకోవాలి.

వినాయకుడి పూజ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. """/"/ పూజ అనంతరం శిశువు తల్లిదండ్రులు మంత్రపూర్వకంగా ను ధరించాలి.

శిశు తండ్రి కుడి తొడపై కూర్చోపెట్టుకొని వెండి గిన్నె, చెంచాతో ఆవు పాలతో తయారుచేసిన పరమాన్నాన్ని శిశువు మేనమామ మొదటగా మూడుసార్లు ఆ శిశువుకు పెట్టాలి.

అనంతరం శిశువు తల్లిదండ్రులు, బంధువులు శిశువుకు తినిపించాలి.తరువాత వివిధ రకాల వస్తువులైన పుస్తకాలు, బంగారం, పనిముట్లు, డబ్బులు వంటి వాటిని శిశువు ముందు ఉంచాలి.

ముందుగా బిడ్డ వాటిలో ఏ వస్తువులు తాగితే ఆ పనిలో నైపుణ్యం కలిగి ఉంటుందని భావిస్తారు.

అదే విధంగా బిడ్డ తాకే వస్తువును బట్టి తన పూర్వ జన్మ గురించి తెలుస్తోందని పెద్దలు చెబుతుంటారు.

ఈ విధంగా అన్నప్రాసనను ఉత్తరాయణంలో చేయడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతున్నారు.

రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వచ్చే ఏడాదే పెళ్లి పిల్లలంటూ పోస్ట్!