తెలంగాణ కుంభమేళగా పేరు పొందిన మేడారం మహా జాతర గురించి అందరికీ తెలుసు.ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా మేడారం జాతరను ఘనంగా నిర్వహించబోతున్నారు.
అయితే ఆ జాతర ఎప్పడి నుంచి ఎప్పటి వరకు జరపనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది.తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.
వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.సమ్మక్క-సారలమ్మలకు భక్తులు బెల్లాన్ని బంగారంగా బంగారం సమర్పిస్తుంటారు.
కొంత మంది తమ నిలువెత్తు బంగారాన్ని భక్తులంతా అమ్మ వారికి అందజేసి మొక్కులు చెల్లించుకుంటారు.ఇంటిల్లిపాది వన దేవతల చెంతకు చేరి… అక్కడి జంపన్న వాగులో స్నానాలు చేస్తారు.
ఆ తర్వాత అమ్మల వద్దకు వెళ్లి దర్శనం చేసుకుంటారు.అనంతరం అక్కడే వంటలు చేసుకొని తింటారు.
హాయిగా మూడ్రోజుల పాటు జాతరను ఎంజాయ్ చేస్తారు. """/" /
మేడారం జాతర సమీపిస్తుండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
ముఖ్యంగా రోడ్ల విస్తరణ, విద్యుత్, నీటి సరఫరా తదితర ఏర్పాట్లను పూర్తి చేసింది. జంపన్న వాగు వద్ద ప్రత్యేక నల్లాలు, ఘాట్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తోంది.
ఈసారి భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నారు.సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ.
వాటిని పర్యవేక్షిస్తున్నారు.వందలాది పోలీసులు మేడారం జాతరలో విధులు నిర్వహించనున్నారు.
వారికి తోడుగా సీసీ నిఘా కూడా ఈసారి పటిష్ఠంగా ఉండనుంది.
కీరవాణి గారు అలాంటి వ్యక్తి.. ప్రవస్తికి భారీ షాకిచ్చే విధంగా సింగర్ లిప్సిక రియాక్షన్!