వాట్సప్ స్టేటస్ లో ఈ ట్రిక్స్ తెలుసా మీకు…?

మనలో చాలామంది పొద్దున లేచినప్పటినుండి పడుకునే వరకు గంటలు గంటలు వాట్సప్ ఉపయోగిస్తుంటారు.

అయితే వాట్సాప్ లో ఉన్న అన్ని ఫీచర్స్ చాలా మందికి తెలియదు కూడా.

వాట్సాప్ లో తరచు అప్డేట్స్ వస్తుంటాయి, వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు.అయితే కొత్తగా ఏ అప్ డేట్ వచ్చింది అది ఎలా ఉపయోగించాలన్న కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోకుండా అలాగే వదిలేస్తున్నారు.

ఈ వాట్సాప్ మొదటగా కేవలం ఒక మెసేజింగ్ యాప్ గా పరిచయం అయింది.

కాకపోతే, ఆ తర్వాత రోజు రోజుకి అప్డేట్స్ వల్ల అనేక ఫీచర్స్ ఇందుకు జత చేయబడ్డాయి.

ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి రోజురోజుకి యూజర్లకు వాట్సప్ అనేక ఫీచర్లను అందజేస్తూ వస్తున్నాయి.

అయితే ఈ వాట్సప్ తో పాటు కొన్ని ట్రిక్స్ వాడితే వాట్సప్ ని మరింత గా ఉపయోగించుకోవచ్చు.

ముందుగా మీరు ఎంచుకున్న స్టేటస్ ను నీ ఫోన్ లోని ఏ కాంటాక్ట్ కైనా పంపించాలనుకుంటే అందుకు సంబంధించిన ఫైల్ మీ ఫోన్ లో ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవడం ఓ కష్టమైన పనే.

ఇందుకు కాస్త సమయం కూడా పడుతుంది.ఇదంతా కాకుండా సింపుల్ గా వాట్సాప్ స్టేటస్ నుండే అందుకు సంబంధించిన ఫైల్ ని మీరు పంపించాల్సిన వ్యక్తులకు సులభంగా పంపవచ్చు.

అది ఎలా అంటే ముందుగా మీ వాట్సాప్ స్టేటస్ పై క్లిక్ చేసి ఆ తర్వాత మై స్టేటస్ పక్కన ఉండే త్రీ డాట్స్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు గత 24 గంటల్లో పెట్టిన స్టేటస్ లను చూపిస్తుంది.

ఇక ఆ తర్వాత మీరు ఏ వాట్సాప్ స్టేటస్ ను ఫార్వర్డ్ చేయాలనుకున్నారు ఆ వాట్సాప్ స్టేటస్ పక్కనే ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేయడంతో అక్కడ ఫార్వర్డ్ అనే ఆప్షన్ కనపడుతుంది.

ఇలా ఫార్వర్డ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు ఎవరికైతే ఆ స్టేటస్ ను పంపిద్దాం అనుకున్నారో వారికి సులువుగా పంపవచ్చు.

అంతే కాదు మీరు పెట్టే వాట్సాప్ స్టేటస్లు మీ కాంటాక్ట్స్ లో ఉన్న అందరూ చూడాలా లేకపోతే కేవలం కొంత మంది మాత్రమే చూడాల అన్న వాటిపై కూడా స్టేటస్ ప్రైవసీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు.

"""/"/ ఇకపోతే ఇందుకు సంబంధించి వాట్సప్ ఓపెన్ చేసి స్టేటస్ లో క్లిక్ చేయగా పైన కుడి వైపు త్రీ డాట్స్ క్లిక్ చేయాలి.

ఆ తర్వాత స్టేటస్ ప్రైవసీ అనే ఆప్షన్ ని ఎంచుకోవడం ద్వారా అందులో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్స్పెక్ట్, ఓన్లీ షేర్ విత్ అనే మూడు ఆప్షన్లు కనబడుతాయి.

ఇక ఇందులో మై కాంటాక్ట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తులు అందరూ మీ స్టేటస్లు చూడగలరు.

ఇక అదే మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ను సెలెక్ట్ చేయడం ద్వారా మీ స్టేటస్ ను ఎవరు చూడకూడదో వారిని మీరు ఎంచుకోవచ్చు.

ఇక ఆ తర్వాత ఓన్లీ షేర్ విత్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కేవలం మీ స్టేటస్ ను సదరు వ్యక్తులు మాత్రమే చూసేలా వాటిని అప్డేట్ చేయవచ్చు.

ఈ పరిస్థితిలో మిగతా వారికి ఆ స్టేటస్ కనపడదు.కాబట్టి మీ వాట్సాప్ స్టేటస్ ఎవరు చూడాలో ఎవరు చూడకూడదో మీరే నిర్ధారణ చేసుకోవచ్చు.

వీడియో వైరల్: ఇదేంటి భయ్యా.. ఈయన అచ్చం మోడీలా ఉన్నాడే..