క్షీర సాగర మథనంలో ఏమేమి పుట్టాయో తెలుసా?

రాక్షసుల బాధను భరించలేక మరింత శక్తి కోసం దేవతలంతా కలిసి శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్లగా.

క్షీర సాగర మథనాన్ని చిలికి అమృతం ససేవించమని చెప్తాడు.దానికి రాక్షసుల సాయం కూడా తీసుకోమని చెప్తాడు.

మహా విష్ణువు సూచనతో దేవతలు అమృతం కోసం రాక్షసుల సాయం తీసుకొని వాసుకి అనే పామును తాడుగా.

గిరి పర్వతాన్ని కవ్వంగా వాడి పాల సముద్రాన్ని చిలికిన విషయం అందరికీ తెలిసిన విషయమే.

అయితే అలా క్షీర సాగర మథనాన్ని చిలికేటప్పుడు అమృతం కంటే ముందుగా అందులో నుంచి ఏమేం పుట్టాయో మాత్రం చాలా మందికి తెలీదు.

క్షీర సాగర మథనంలో ఏమేం ఉద్భవించాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా సురాభాండం అంటే కల్లుకు అధిదేవత పుట్టింది.

తర్వాత అప్సరసలైన రంభ, మేనక, ఊర్వశి, ఘృతాచి, తిలోత్తమ, సుకేశి, చిత్రలేఖ, మంజుఘోష పుట్టాయి.

ఆ తర్వాత కౌస్తుభం అంటే అమూల్యమైన మాణిక్యం ఉద్భవించింది.ఉచ్చైశ్రవము అనే ఏడు తలల దేవతాశ్వం పుట్టింది.

దాని తర్వాత కోరిన కోరికలు ఇచ్చే కల్ప వృక్షం, కోరిన కోరికలు తీర్చే కామ ధేనువు పుట్టాయి.

అనంతరం ఐరావతం వచ్చింది.ఆ తర్వాత లక్ష్మీ దేవి పుట్టింది.

"""/" / తదనంతరం పారిజాత వృక్షం ఉద్భవించింది.అటు పిమ్మట కాల కూట విషమైన హాలాహలం, చంద్రుడు పుట్టాయి.

తర్వాత దేవతల వైద్య శిఖామణి ధన్వంతరి పుట్టింది.చిట్ట చివరగా అమృతం ఉద్భవించింది.

క్షీర సాగర మథనంలో ఉద్భవించిన ప్రతీ ఒక్క దానిని ఎవరో ఒకరు తీసుకున్నారు.

మరణం రాకుండా ఉంచే అమృతాన్ని మాత్రం రాక్షసుల చేజిక్కకుండా చేసి దేవతలే దక్కించుకున్నారు.

పవన్ వల్ల ఆ స్థలాలకు రెక్కలొచ్చాయట.. ఆ స్థలాల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!