పూజ పూర్తయిన తర్వాత మిగిలిన పూజ సామాగ్రిని ఏమి చేయాలో మీకు తెలుసా..

చాలామంది ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక భగవంతునికి పూజలు చేస్తూనే ఉంటారు.ప్రత్యేకంగా పండుగ సమయాలలో దేవుడి పూజకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.

పండు, పువ్వు, కొబ్బరి, పసుపు, కుంకుమతో సహా అనేక వస్తువులను భగవంతుని పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

పూజకు ఉపయోగించే అన్ని వస్తువులు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.భగవంతున్ని పూజించడానికి పూజ సామాగ్రి అవసరమవుతుంది.

ఇవన్నీ ఉపయోగించకుండా పూజ చేయడం అస్సలు సాధ్యం కాదు.అయితే ప్రతిరోజు చాలామంది ప్రజలు ఏదో ఒక దేవుడిని పూజిస్తూనే ఉంటారు.

అందుకు కావాల్సిన పూజ వస్తువులను వినియోగిస్తూనే ఉంటారు.పూజ చేసిన తర్వాత దాదాపుగా మిగిలిపోయిన పూజ వస్తువులు కచ్చితంగా ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే ఈ పూజ వస్తువులను ఏం చేయాలి అనే విషయం గురించి ఎవరికీ తెలియదు.

పూజ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన పదార్థాలను కొందరు ఆలయంలోని అర్చకులకే ఇస్తూ ఉంటారు.

ఇంకొందరు ప్రవహించే నీటిలో కల్పిస్తారు.నీటిలో వదిలేయడం చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు.

జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి వీటిని ఉపయోగించవచ్చు అని కూడా చెబుతున్నారు.మిగిలిపోయిన పూజ వస్తువులను ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముఖ్యంగా మిగిలిపోయిన పూజా వస్తువులలో కచ్చితంగా కుంకుమ ఉంటుంది.అయితే ఇంట్లోనే వివాహిత స్త్రీలు పూజ చేసిన తర్వాత మిగిలిపోయిన కుంకుమను ఉపయోగించవచ్చు.

అటువంటి స్త్రీలు ఈ కుంకుమను ధరిస్తే శుభం జరుగుతుంది.అయితే పూజలో మిగిలిపోయిన పువ్వులను మాల కట్టి ఇంటి ప్రధాన జ్వరానికి కట్టడం ఎంతో మంచిది.

పూజలో మిగిలిపోయిన అక్షితలు అన్నంలో పసుపు, కుంకుమ కలిపితే అక్షితే సిద్ధిస్తుంది.ఈ అక్షితలు రోజు వాడే గోధుమలు లేదా బియ్యంలో కలుపుకోవడం వల్ల ఆ ఇంటి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే పూజలో మిగిలిపోయిన తమలపాకులు ఎర్రటి శుభ్రమైన గుడ్డలో కట్టి డబ్బుల పెట్టెలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

విశాల్ పై ఆరోపణలు చేసిన యూట్యూబర్లపై కేసు.. ఆ నిర్ణయంతో భారీ షాక్ తగిలిందిగా!