ఎవరైనా మీ ఇంటికి భోజనానికి వస్తే ఏమి చేయాలో తెలుసా..

మనకు తెలిసిన వారు కానీ మన బంధువులు కానీ ఏదైనా అవసరం ఉండి మన ఇంటికి వస్తూ ఉంటారు.

ఇలా అతిధులు మన ఇంటికి వస్తే వారికి చేయవలసిన మర్యాదల గురించి శాస్త్రం ఏమి చెప్తుంది అంటే ఇలాంటి వారికి అతిథి మర్యాదలు చేయలేకపోయినా కనీసం మన స్థాయికి తగ్గట్టు మనం తినేదాంట్లోనే కాస్త వారికి కూడా పెడితే మంచిది.

పూజలో ఉన్నప్పుడు కూడా మన ఇంటికి గురువుగారు వచ్చినా, మహాత్ములు వచ్చిన పూజ విడిచిపెట్టి వెళ్లి వారు వచ్చిన పని గురించి తెలుసుకుని వారు వెళ్ళిన తర్వాతే పూజ చేసుకోవాలి అని ఉంది.

ఇంకా చెప్పాలంటే అతిథి రూపంలో వచ్చిన వ్యక్తి మహాత్ముడు అయితే వారిని సేవించకుండా తన దగ్గర కూర్చోడాన్ని పరమేశ్వరుడు కూడా ఒప్పుకోడు.

గజేంద్ర మోక్షం కదా మూలం మనకు అదే అర్థం చెబుతోంది.ఒకప్పుడు ద్రావిడ దేశంలో ఒక రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండమీద ప్రశాంతమైన ఒక ప్రాంతంలో కూర్చుని జపం చేసుకుంటూ ఉన్నాడు.

అప్పుడు అక్కడికి మహాత్ముడైన మహాముని వస్తాడు.అప్పుడు ఆ రాజు ఆయన వస్తే నాకేంటి అనే లాగా ఉండిపోయాడు.

అప్పుడు ఆ మహాముని నువ్వు తమోగుణంతో ప్రవర్తిస్తున్నావు వచ్చే జన్మలో ఏనుగు లా పుడతావు అని శపించాడు.

అయితే ఆజన్మలో జపాత పాదులు చేశావు కాబట్టి నీ ప్రాణం మీద కూర్చున్నప్పుడు పరమేశ్వరుడు గుర్తుకొచ్చి శరణాగతి చేస్తావని వరమిచ్చాడు.

అందువల్లే ఏనుగుగా పుట్టిన తర్వాత ముసలికి చిక్కి ప్రాణం పోతున్నా సమయంలో శరణగతి చేసే విష్ణువును పిలుస్తాడు.

"""/"/ ఇంటికి వచ్చిన వారితో సరిగ్గా మాట్లాడకపోవడం, లోపలికి రండి అని పిలవకపోవడం ఇలా చేసే వారి ఇంటికి అస్సలు వెళ్ళకూడదు అని పరమేశ్వరుడు పార్వతి దేవితో చెబుతాడు.

ఒకవేళ ఇంటికి వచ్చిన అతిథులకు అన్నం వడ్డించలేని స్థితిలో ఉంటే మర్యాదపూర్వకంగా అయ్యా నన్ను మన్నించండి మీవంటి మహాత్ములు మా ఇంటికి వస్తే నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నా నా పరిస్థితి ఇలాగ ఉంది అని చెప్పడం కూడా ఉత్తమమే.

అండాశయ క్యాన్సర్ ఎందుకు వ‌స్తుంది.. దీని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలుసా?