గుడికి ఏ సమయాలలో వెళ్లాలో తెలుసా?

గుడికి ఏ సమయాలలో వెళ్లాలో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయాలను దర్శించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.కొందరు ప్రతిరోజు వారికి సమీపంలో ఉన్న ఆలయాలను సందర్శిస్తుంటారు.

గుడికి ఏ సమయాలలో వెళ్లాలో తెలుసా?

మరికొందరు వారానికి ఒక సారి అయినా వారి ఇష్టదైవాన్ని సందర్శించి వారి కోరికలను దేవుని సన్నిధిలో దేవుడికి తెలియజేసుకుంటారు.

గుడికి ఏ సమయాలలో వెళ్లాలో తెలుసా?

మరికొందరు మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను దర్శించుకుంటారు.అయితే కొందరు దేవాలయాలను వారికి వీలున్న సమయంలో దర్శించుకుంటారు.

అలా దర్శించుకోవడం మంచిది కాదని, దేవాలయాలను ఏ సమయాలలో దర్శించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

"""/" / సాధారణంగా మనం దేవాలయాలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో దర్శించుకుంటాము.

ఉదయం స్నానమాచరించి పరగడుపున దేవాలయాలను దర్శించడం ఎంతో మంచిది.అలాగే ఉదయం శ్రీ మహావిష్ణువు ఆయన అవతారాలైన రాముడు, కృష్ణుడు తదితర దేవాలయాలను దర్శించడం ఎంతో మంచిది.

ఉదయం పూట ఈ దేవాలయాలను సందర్శించడం వల్ల గుడిలో ప్రసాదంగా తులసి తీర్థాన్ని ఇస్తారు.

ఈ తులసి తీర్థాన్ని తీసుకోవడం ద్వారా శ్వాసకోశను శుభ్రపరుస్తుంది.అంతేకాకుండా ఉదయమే దేవాలయాన్ని దర్శించడం ద్వారా ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా గడిచి మనం అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని నమ్మకం.

అలాగే సాయంత్రం పూట శివాలయాలను సందర్శించాలి.శివాలయాల్లో మారేడు తీర్థం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

అంతేకాకుండా ఆ శివుడి అనుగ్రహం మనపై ఉండటం వల్ల మన కోరికలు నెరవేరుతాయి.

ఈ విధంగా గుడికి వెళ్లేటప్పుడు నియమ నిబంధనలను పాటించడం ద్వారా అధిక ఒత్తిడి నుంచి విముక్తి కలిగి ఎంతో సంతోషంగా గడుపుతారు.

మనిషి తన పనిని తాను నిర్వర్తిస్తూ ఆ దేవుడు పై విశ్వాసం కలిగి ఉండటం వల్ల సానుకూల దృక్పథంతో ముందుకు పయనిస్తాడు.

ఇలా చేయడం ద్వారా తను అనుకున్న విజయాలను కూడా చేరుకోగలుగుతారు.ఈ విధంగా ప్రతి మనిషికి దైవం ఏదో ఒక రూపంలో తోడవుతుంది.