సినిమాలలోకి రాకముందు ఏజెంట్ హీరోయిన్ ఏం చేసేవారో తెలుసా?
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ జల ప్రవాహం లాంటిది.ఈ జల ప్రవాహంలోకి కొత్తనీరు వస్తుంటే పాతనీరు వెళ్ళిపోతున్నట్టు ఇండస్ట్రీలోకి కూడా కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటే పాత హీరోయిన్లు కనుమరుగవుతూ ఉంటారు.
అయితే తాజాగా అఖిల్ (Akhil ) హీరోగా నటించిన ఏజెంట్ సినిమా( Agent Movie ) ద్వారా కొత్త హీరోయిన్ సాక్షి వైద్య ( Sakshi Vaidya ) ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా సందడి చేశారు. """/" /
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాక్షి వైద్య తన గురించి పలు విషయాలను వెల్లడించారు.
సాక్షి వైద్య ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను వృత్తిపరంగా ఫిజియోథెరపిస్ట్( Physiotherapist ) అని తెలియజేశారు.
కరోనా సమయంలో మొదట్లో ఖాళీగా ఉన్నాను ఏం చేయాలో దిక్కుతోచక తాను కూడా అందరిలాగే రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని తెలిపారు.
అవి కాస్త వైరల్ కావడంతో చాలామంది సినిమాలలోకి ట్రై చేయొచ్చు కదా అంటూ సలహాలు ఇచ్చారు తన ఫ్రెండ్స్ కూడా తనను మోటివేట్ చేశారు.
"""/" /
ఇలా అందరూ సలహా ఇవ్వడంతో తాను కొన్ని సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చానని అయితే కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చిన ఆ పాత్రలు తనకు నచ్చకపోవడంతో తిరిగి తన వృత్తిపరమైన జీవితంలో తాను బిజీగా ఉన్నానని సాక్షి వైద్య వెల్లడించారు.
ఆ సమయంలోనే ఏజెంట్ మూవీ టీం నుంచి తనకు ఫోన్ కాల్ రావడం మీకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని చెప్పడంతో అదొక పెద్ద స్కాం అనుకొని ఆ ఫోన్ కాల్ లైట్ తీసుకున్నాను.
"""/" /
నాకు పరిచయం ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏజెంట్ సినిమా గురించి చెప్పడంతో హైదరాబాద్ కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను.
ఆడిషన్ లో ఓకే అయి హీరోయిన్ నేనే అని చెప్పడంతో ఒక్కసారిగా నమ్మలేకపోయానని ఈ సందర్భంగా తనకు ఈ సినిమాలో వచ్చిన అవకాశం గురించి కూడా సాక్షి వైద్య తెలియజేశారు.
మెడ నలుపును వదిలించడానికి బెస్ట్ సొల్యూషన్ ఇది.. డోంట్ మిస్!