వాకింగ్ చేసేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?

వ్యాయామాల్లో అత్యంత సులువైనది మరియు అందరికీ అనువైనది వాకింగ్.( Walking ) పైగా ఇది ఎటువంటి ఖర్చులేని వ్యాయామం.

మన దినచర్యలో వాకింగ్ ను భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటాడు.

అది అక్షరాల నిజం.వాకింగ్ వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో లాభాలు పొందుతారు.

వాకింగ్ శరీర కొవ్వును కరిగిస్తుంది.రక్తపోటును( Blood Pressure ) అదుపులో ఉంచుతుంది.

ఎముకల నష్టాన్ని తగ్గిస్తుంది.ఒత్తిడిని చిత్తు చేయడంలో సహాయపడుతుంది.

నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.అలాగే వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు( Heart Diseases ) వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

జీవితకాలం పెరుగుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే వాకింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

అందుకే ప్రతి ఒక్కరూ వాకింగ్ ను అలవాటు చేసుకోవాలి.అయితే వాకింగ్ చేసేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి.

అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.వాకింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలను అందించాలి.

పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.లేదంటే నీరసంగా, బద్ధకం( Dull, Lethargic ) గా మారిపోతారు.

"""/" / వాకింగ్ చేసేటప్పుడు తలను స్ట్రైట్ గా పెట్టాలి.కొందరు తలను నేలకు వచ్చి వంగినట్లు నడుస్తుంటారు.

ఇలా చేయడం వల్ల మెడ నొప్పి, నడుం నొప్పి వంటివి వేధిస్తాయి.అలాగే ఖాళీ కడుపుతో ఎప్పుడూ వాకింగ్ ప్రారంభించకూడదు.

వాకింగ్ కు ముందు కనీసం వాటర్ ను అయినా తీసుకోవాలి.వాకింగ్ ముందు వార్మప్ చేయడం చాలా ముఖ్యం.

లేదంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు( Joint Pain, Knee Pain ) మొదలవుతాయి.

"""/" / అలాగే వారం మొత్తం వాకింగ్ చేయడం వల్ల కండరాలకు అంత మంచిది కాదు.

కాబట్టి వారానికి ఐదు రోజులు వాకింగ్ చేస్తే సరిపోతుంది.రెండు రోజులు వాకింగ్ నుంచి బ్రేక్ తీసుకోవచ్చు.

జ్వరంగా ఉన్నప్పుడు అస్సలు వాకింగ్ చేయకూడదు.ఎందుకంటే ఆ సమయంలో శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది.

అలాంట‌ప్పుడు వాకింగ్ చేస్తే శరీరం మరింత బలహీనంగా మారుతుంది.ఇక‌ వాకింగ్ ఆరోగ్యానికి మంచిదే.

కానీ అధికంగా చేయడం మాత్రం చాలా ప్రమాదకరం.రోజుకు ప్రతీ వ్యక్తి 35 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ చేడ‌చ్చు.

ఎన్ని షాంపూలు మార్చిన చుండ్రు పోవడం లేదా.. అయితే ఇది ట్రై చేయండి!