రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?
TeluguStop.com
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇక దర్శకులు సైతం భారీ విజయాలను సాధించమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు.
రాజమౌళి(Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.
నిజానికి ఆయన ఇంతకుముందే మహేష్ బాబుతో (Mahesh Babu)ఒక సినిమా చేయాల్సింది.కానీ ఆ సినిమా అనుకోని కారణాల వల్ల పట్టాలైతే ఎక్కలేదు.
విక్రమార్కుడు సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు( Rajamouli And Mahesh Babu) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.
కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ కథ మెటీరియలైజ్ అవ్వకపోవడంతో వీళ్లిద్దరి కాంబినేషన్ అయితే క్యాన్సిల్ అయింది.
మరి అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా అయితే రాలేదు.
మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద యావత్ ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాతో 3000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టలని రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరూ చాలా మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్ళందరూ కలిసి ఎలాంటి సక్సెస్ సాధిస్తారు.ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది తద్వారా తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎలివేట్ అవుతుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
"""/" /
మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి రాజమౌళి పూనుకున్నాడనే చెప్పాలి.
మరి ఈ సినిమా తర్వాత హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో మన ఇండస్ట్రీ పోటీ పడే స్థాయికి ఎదుగుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్.. పుట్టినరోజున ఆ సినిమా రిలీజ్ కానుందా?