సీతా రాముల వారి కళ్యాణం చూస్తే.. ఎలాంటి పుణ్య ఫలితం లభిస్తుందో తెలుసా..?

శ్రీరామనవమి ( Rama Navam )రోజున దాదాపు ప్రతి గ్రామంలో సీతారామ కళ్యాణం అట్టహాసంగా జరుగుతుంది.

సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం అని పండితులు చెబుతున్నారు.

సాధారణంగా సర్వ సంపదకు నిలయం భద్రాచలం.అలాగే సకల జనలోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం అని నిపుణులు చెబుతున్నారు.

శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచల దివ్య క్షేత్రం.

అయితే సీతారామ కళ్యాణం వీక్షిస్తే కలిగే ఫలితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / భద్రుడు అనగా రాముడు అని, అచలుడు అంటే కొండ అని, అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్యధామం కనుక ఈ క్షేత్రం భద్రాచలం గా ప్రసిద్ధి చెందిదని స్థానిక భక్తులు చెబుతున్నారు.

శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడ గడపడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క వైశిష్ట్యం.

శ్రీరామ నామము సకల పాపాలను దూరం చేస్తుందని సకల శాస్త్రాలు చెబుతున్నాయి.భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కల్యాణము మార్గశిర శుద్ధ పంచమి రోజు జరిగినట్లుగా పురాణాలలో ఉంది.

భక్త రామదాసు తిరిగి వచ్చాక చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామచంద్రు( Lord Rama )ని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు.

"""/" / శ్రీ సీతారామ కళ్యాణము రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజే జరిగింది.

ఆ మరుసటి రోజున శ్రీ రామ పట్టాభిషేకం రాముడికి జరిగింది.కోదండ రామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భూమికి దిగి వస్తారు.

శ్రీరామచంద్రుని దివ్యదర్శనం మహనీయంగా నేత్రపర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారు.ఆంజనేయుని భక్తికి మెచ్చి హనుమ గుండెల్లో కొలువైన శ్రీ రాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామ గ్రామాన రామాలయలు నెలకొని ఉన్నాయి.

భద్రాద్రి( Bhadradri )లో జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొనలేక పోయినా దగ్గరలో ఉన్న రామాలయంలో జరిగే పూజలు, కల్యాణోత్సవాల్లో పాల్గొన్న సర్వపాపాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.

యశ్ ఎందుకు విలన్ పాత్రలను చేస్తున్నాడు…