విమానం టైర్లు ఎలాంటి మెటీరియల్‌ తో చేస్తారో తెలుసా?

మీలో ఎవరికైనా ఎపుడైనా ఈ అనుమానం వచ్చిందా? అత్యంత బరువుగల విమానాలకు క్రింద ఎలాంటి టైర్లు వాడుతారనే సందేహం కలిగే ఉంటుంది మీకు.

ఇవి లేనిదే ఎలాంటి వాహనం అయినా ముందుకు కదలదు.ముఖ్యంగా విమానం అయితే గాలిలో ఎగిరేటప్పుడు దానికి ఇవి అవసరం లేదుగాని, ఫ్లైట్ ఎగరానికి ముందు, ల్యాండ్ అయే ముందు ఇవి తప్పనిసరి.

ఆ సమయంలో వాటిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది.దాంతో చాలా ప్రత్యేకమైన మెటీరియల్ని విమానం టైర్ల తయారీలో వాడుతారు.

అయితే అందరికి దీని గురించి పెద్దగా తెలిసి ఉండదు.విమానం ల్యాండింగ్‌ అయేటప్పుడు ఒత్తిడి తట్టుకుని టైర్లు వేగంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

ఆ సమయంలో అంత ఒత్తిడికి ఎలా తట్టుకోగలుగుతాయనే విషయం గురించి ఇపుడు తెలుసు కుందాం.

విమానం టైర్లు చాలా ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయి.విమానం టైర్లు వేల పౌండ్ల బరువు, అధిక వేగాన్ని తట్టుకోగలవు.

అవి ప్రత్యేకంగా తయారు చేయడమే ఇందుకు కారణం.విమానం టైర్లలో నైట్రోజన్ వాయువు నింపబడుతుంది.

దీని కారణంగా ల్యాండింగ్ సమయంలో కఠినమైన పరిస్థితుల్లో కూడా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది.

"""/"/ అలాగే విమానం టైర్ల తయారీలో అల్యూమినియం, నైలాన్‌, స్టీల్‌ వంటివి వాడుతారు.

ఈ టైర్లు సింథటిక్ రబ్బరు సమ్మేళనాల కలయికతో తయారు చేయబడతాయి.ఇందులో అల్యూమినియం స్టీల్, నైలాన్‌ టైర్లు బలోపేతం అయ్యేందుకు సహకరిస్తాయి.

వల్కనైజేషన్‌ అనే రసాయనిక ప్రక్రియ ద్వారా టైర్లు తయారు చేస్తారు అనే సంగతి మనం స్కూళ్లలో చదివాము కదా.

సరిగ్గా ఇక్కడ అలాంటి సూత్రాన్నే వాడుతారు.ఈ ప్రక్రియలో క్రాస్‌ లింకింగ్‌ ద్వారా పలిమర్‌లను మరింత మన్నికైన పదార్థాలుగా మారుతాయి.

విమానం ల్యాండింగ్‌ సమయంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఇవి పగిలిపోవు.ఎలాంటి సమస్య రాదు.

ఎలా గౌరవించాలో మీరు నేర్పించక్కర్లేదు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్ వైరల్!