మహాలయ పక్షము అంటే ఏమిటో తెలుసా..?

మనిషి దేవతారాధనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృదేవతలకు( Pitru Paksham )ఇవ్వాలని పండితులు చెబుతున్నారు.

అలాగే మరణించిన వారి కోసం పితృ కర్మలు ఆచరించడం, తర్పణాలు విడిచి పెట్టడం మన సనాతన ధర్మంలో సంప్రదాయం.

ఏ వ్యక్తి అయినా వారి ఇంటిలో కొన్ని కారణాల వల్ల గతించిన తిధులలో పితృ కర్మలు ఆచరించడం కుదరని పక్షంలో, అలాగే కొన్ని దుర్హటనలు ఎదురైన కోల్పోయినటువంటి పరిస్థితులలో వారు ఎప్పుడూ చనిపోయారో తెలియని స్థితిలో ఏర్పడినప్పుడు అటువంటి వారికి భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షాలు చాలా ప్రాధాన్యతమైనవి అని పండితులు( Scholars ) చెబుతున్నారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి నెలలో అమావాస్యకు ( Amavasya )పితృ తర్పణాలు విడిచిపెట్టాలి.

అలా ప్రతి మాసం విడిచిపెట్టలేనటువంటి వారు భద్రపదా మాసంలో వచ్చేటువంటి మహాలయ పక్షాలలో మహాలయ అమావాస్య రోజు గనుక ఆ గతించిన పితృ దేవతలకు తర్పణ కార్యక్రమాలు ఆచరిస్తే ఆ సంవత్సరం మొత్తం చేసిన ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఇక ఉత్తరాయణము దేవతల కాలము కాబట్టి ఉత్తమ కాలమని,దక్షిణయానము పితృదేవతల కాలము కాబట్టి అశుభ కాలమని మన పూర్వీకులు నమ్ముతారు.

మహాలయమంటే భాద్రపద బహుళ పాండ్యమీ ( Bhadrapada Shuddha Padyami )నుంచి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు జరుపుకుంటారు.

"""/" / దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెబుతారు.ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి, ( Tidhi Trayodashi )అనగా వర్షఋతువునందు బాద్రపదా కృష్ణ త్రయోదశి మఘా నక్షత్రముతో కూడి ఉన్నప్పుడు దేనితో కూడిన ఏ పదార్థంతో శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుంది.

అంతటి విశిష్టత గాంచిన ఈ మహలయ పక్షమందు అన్ని వర్ణముల వారి శక్తిని బట్టి చతుర్దశి తిధిని విడవకుండా 15 రోజులు ఆచరిస్తారు.

శక్తి లేనివారు తమ పెద్దలు మరణించిన తిధిని బట్టి ఆయా తిధులలో తర్పణ శ్రద్ధ కర్మలు ఆచరిస్తారు.

గతించిన వారి తిధి గుర్తు లేనప్పుడు మహాలయ అమావాస్య నిర్ణయింపబడింది.

బానిసత్వ పరిస్ధితుల్లో భారతీయ కార్మికులు : ఇటలీ పోలీసుల ఆపరేషన్‌లో 33 మందికి విముక్తి