Krishna , Mahesh Babu : ఇండస్ట్రీ కి వచ్చే ముందు కృష్ణ మహేష్ బాబు కి చెప్పిన మాట ఏంటో తెలుసా..?
TeluguStop.com
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సూపర్ సక్సెస్ అందుకున్న హీరోల్లో కృష్ణ( Krishna ) ప్రముఖుడు.
ఈయన ఒక సంవత్సరంలో దాదాపు 20 సినిమాలను రిలీజ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
అలాగే అసలు రెస్టు లేకుండా మూడు షిఫ్టులుగా షూటింగ్స్ లో పాల్గొంటూ తను తక్కువ సమయంలో షూటింగ్ లను పూర్తి చేసుకుంటూ సినిమాలను రిలీజ్ చేసేవాడు.
ఇక అదే విధంగా తన కొడుకు అయిన మహేష్ బాబు( Mahesh Babu ) కూడా సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
అయితే ఇప్పుడు మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
"""/" /
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు ఇండస్ట్రీలో టాప్ స్టార్ కొనసాగుతున్నాడు.
ఇక రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు ఇక దానికి సంబంధించిన మేకోవర్లో చాలా బిజీగా ఉన్నాడు.
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కృష్ణ తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్( Child Artist ) గా పలు సినిమాల్లో కూడా నటించాడు.
ముఖ్యంగా కృష్ణ, విజయశాంతి హీరో హీరోయిన్లుగా వచ్చిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
"""/" /
ఇక ఇదే టైంలో కృష్ణ మహేష్ బాబు కి సినిమాల గురించి చెబుతూ ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకోమని చెప్పారట.
అది ఏంటి అంటే మనం చేసే సినిమాల షూటింగ్స్ చాలా తొందరగా ఫినిష్ చేయాలి.
ఆ సినిమా కోసం ఎంత కష్టమైన పడాలి, ఇక అన్నిటికీ మించి సినిమానే మన లైఫ్ అనుకున్నప్పుడు ఇక్కడ మన రాణించగలుగుతామంటూ కృష్ణ చెప్పిన మాటలు మహేష్ బాబు ఎప్పటికీ మర్చిపోకుండా అలాగే గుర్తుపెట్టుకొని ఉంటాడట.
ప్రస్తుతం అతను సక్సెస్ అవ్వడానికి కూడా ఆ మాటలే కారణం అని మహేష్ బాబు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం విశేషం.
ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?