ఆమెను పెళ్లి చేసుకునేందుకు కిరాక్ ఆర్పీ అంత సాహసం చేశాడా.. వామ్మో!
TeluguStop.com
ఎవరైనా సరే ప్రేమించిన వ్యక్తిని సొంతం చేసుకోవడానికి ఎన్నో సాహసాలు చేస్తూ ఉంటారు.
వారికోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు.నిజానికి ఇప్పుడున్న ప్రేమలు అలా ఉండవు కానీ.
ఒకప్పుడు మాత్రం ప్రేమించిన వారి కోసం అన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండేవారు.
ఇప్పుడున్న ప్రేమలలో కొంతవరకు మాత్రమే నిజాయితీ కనిపిస్తుంది.ఇక ఇప్పుడు కూడా కొందరు మాత్రం తమ ప్రేమలను దక్కించుకోవడానికి సాహసాలు చేస్తున్నారు.
అందులో జబర్దస్త్ కామెడీ షో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు.ఇటీవల ఆర్పీ తను ప్రేమించిన అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
అతడు ప్రేమించిన విషయం చాలా వరకు ఎవరికీ తెలియక పోగా ఈ మధ్యనే ఆ విషయం కూడా బయటపడింది.
ఇంతకు అతను చేసిన సాహసం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో కిరాక్ ఆర్పీ అడుగుపెట్టి అందులో కామెడీ చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.కేవలం జబర్దస్త్ లోనే కాకుండా పలు కామెడీ షో లలో చేసి బుల్లితెర ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకున్నాడు.
మొత్తానికి తన కామెడీతో ఆర్ పీ నవ్వులు పండిస్తూ జబర్దస్త్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
"""/"/
ఇక బుల్లితెర నుంచి వెండి తెరపై అడుగుపెట్టి పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నాడు.
ఇక కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఆర్ పి ఇటీవలే సొంతంగా ఒక కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్నాడు.
ఈయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటంతో.యూట్యూబ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మొదట తన కొత్త ఇంటిని వీడియో తీసి చూపించాడు.
"""/"/
ఇక ఇదంతా పక్కన పెడితే ఆర్ పీ ఈటీవీ లోనే కాకుండా స్టార్ మా లో కూడా అడుగు పెట్టి తనేంటో మరింత నిరూపించుకుంటున్నాడు.
ఇక తాజాగా 'పార్టీ చేద్దాం పుష్ప' అనే ఈవెంట్ లో పాల్గొని తన లవ్ గురించి ఒక విషయాన్ని బయట పెట్టాడు.
తాజాగా ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో ఆర్ పీ తన కాబోయే భార్య ను కూడా పరిచయం చేశాడు.
అంతేకాకుండా అందులో తను ఆమెను ప్రపోజ్ చేసినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెళ్లికి ఒప్పించేంతవరకు అతడు చేసిన సాహసాన్ని కూడా చూపించగా అది అందరికీ కనెక్ట్ అయ్యింది.
పైగా అందరి సమక్షంలో ఇద్దరికీ పూలదండ కూడా మార్పించారు స్టార్ మా.ఇక సుడిగాలి సుధీర్ ఆర్ పీ గురించి మరో విషయాన్ని బయటపెట్టాడు.
"""/"/
ఆర్ పీ కి నాగబాబు అంటే ఎంత అభిమానమో సుధీర్ చూపించాడు.
ఎలా అంటే.ఆర్ పీ తన గుండెల పై నాగబాబు పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు.
ఇక దానిని అందరికీ చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.నాగబాబు మాత్రం ఆశ్చర్యపోయి అతడిని దగ్గరికి తీసుకున్నాడు.
ప్రస్తుతం ఆ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.
విదేశీ విద్యార్థులకు ట్రంప్ యంత్రాంగం షాక్.. దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఈ-మెయిల్స్