సుకుమార్ రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వారిలో సుకుమార్( Sukumar ) ఒకరు.

ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా తను చేసిన సినిమాల్లో కూడా ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ను తీసుకొని ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా స్క్రీన్ ప్లే రాసుకొని ఆ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో సుకుమారు ను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం.

ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లుఅర్జున్ తో పుష్ప 2 సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

"""/" / ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ను( Ram Charan ) హీరోగా పెట్టి మరొక సినిమా చేయాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు రంగస్థలం( Rangasthalam ) లాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సినిమా రావడమే కాకుండా ఈ సినిమా రామ్ చరణ్ కి నటుడిగా మంచి గుర్తింపును కూడా తీసుకు వచ్చింది.

కాబట్టి సుకుమార్ తో మరొక సినిమా చేయాలని రామ్ చరణ్ ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమాని పూర్తిచేసుకొని బుచ్చిబాబుతో( Buchibabu ) చేస్తున్న సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు.

ఇక ఈ సమయంలో సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలంటే ఆయన మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయక తప్పదు.

"""/" / కాబట్టి పుష్ప 2( Pushpa 2 ) సినిమా తర్వాత సుకుమార్ ఒక ఆరు నెలల పాటు రామ్ చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేయాలని చూస్తున్నారట.

ఇక వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక వీళ్ల కాంబినేషన్ లో వచ్చే సినిమా 'సైన్స్ ఫిక్షన్' జానర్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.

సంధ్య థియేటర్ లో పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేసిన బన్నీ.. ఏం జరిగిందంటే?