స్టార్ హీరోయిన్స్ కి ఎన్టీఆర్ ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చేవారో తెలుసా ?

స్టార్ హీరోయిన్స్ కి ఎన్టీఆర్ ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చేవారో తెలుసా ?

సీనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారు.ఆయన నటించే సినిమాల పట్ల అభిమానులు ఎంతో ఆసక్తి గా ఉండేవారు.

స్టార్ హీరోయిన్స్ కి ఎన్టీఆర్ ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చేవారో తెలుసా ?

మొదటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన ఎన్టీఆర్ సినిమాల్లోకి రాక ముందు అందరి హీరోల లాగానే స్ట్రగుల్ అయిన వారే.

స్టార్ హీరోయిన్స్ కి ఎన్టీఆర్ ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చేవారో తెలుసా ?

కాలేజీ రోజుల్లో చదువుకుంటూ ప్రతి రోజు పాలు అమ్మి వచ్చిన డబ్బు తో కుటుంబం గడిచింది.

అలా మొదటి నుంచి కష్టపడే తత్వం ఆయనది.ఇక ఎన్టీఆర్ హీరో గా ఎదిగాక తన తోటి హీరోయిన్స్ తో కాస్త కటువుగా ఉంటారనే వార్త ఎప్పుడు ఉండేది.

మరోవైపు అక్కినేని అమ్మాయిలతో సౌమ్యంగా ఉండేవారు.వారితో జోకులు వేస్తూ నవ్విస్తూ తన చుట్టూ తిప్పుకునే వారు.

కానీ ఎన్టీఆర్ కి అంత లౌక్యం ఉండేది కాదు. """/"/ అయితే ఈ వార్తల్లో పెద్ద నిజం లేదు అనేది కుటుంబం చెప్తున్న మాట.

ఎందుకుంటే తనతో నటించే చాలా మంది హీరోయిన్స్ రెగ్యులర్ గా తమ ఇంటికి వచ్చేవారు అని, ఎన్టీఆర్ తోనే కాకుండా తమతో కూడా బాగా ఫ్రెండ్లీ గా ఉండేవారు అంటున్నారు.

మరో వైపు ఆయన సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించాక చాలా మంది హీరోయిన్స్ తమ కుటుంబ సభ్యుల లాగానే ఉండేవారు, అలాగే ఎన్టీఆర్ కి మొదటి నుంచి గేదెలను పెంచే అలవాటు ఉండేది అందుకే తనతో ఎక్కువగా కలిసిపోయిన హీరోయిన్స్ కి 12 గేదెల నుంచి పితికిన రుచికరమైన పాలను, ప్రత్యేకంగా పెట్టిన ఆవకాయ పచ్చడిని, గోంగూర పచ్చడి లాంటివి పంపించే వారట.

"""/"/ అంతే కాదు సెల్వరాజ్ నుంచి కొన్న 40 ఎకరాల వ్యవసాయ భూమి లో పలు రకాల పండ్ల తోటలు, కూరగాయలు పండిచే వారట.

మంచి రకాలు అయిన మామిడి కాయలను ప్యాక్ చేయించి మరి హీరోయిన్స్ కి పంపించే వారట.

ఇలా ఎన్టీఆర్ నుంచి గిఫ్ట్స్ తీసుకునే హీరోయిన్స్ మరెవరో కాదు.దేవిక, కృష్ణ వేణి, శ్రీదేవి, జయప్రద లాంటి వారు ఉండేవారు.

ఇలా పంపించే విషయం తమ కుటుంబానికి తప్ప బయట వారికి తెలియదు.అందుకే ఎన్టీఆర్ కి హీరోయిన్స్ తో సఖ్యతగా ఉండటం రాదు అని పుకార్లు సృష్టించారు అంటున్నారు నందమూరి కుటుంబ సభ్యులు.

షాకింగ్: ఈ దేశంలో ఇస్లాం మతం స్వీకరిస్తున్న విదేశీయులు.. చైనా, కెనడా వాసులు కూడా!