కలలో ఎద్దుల బండి కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా..!
TeluguStop.com
సాధారణంగా చెప్పాలంటే ప్రతి రోజు నిద్రపోతున్నప్పుడు చాలా మందికి ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి.
కొన్నిసార్లు మనుషులు కలలో కనిపిస్తే మరికొన్నిసార్లు వస్తువులు, జంతువులు కనిపిస్తూ ఉంటాయి.కలలు మన మానసిక స్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
అంటే మీకు కలలో కనిపించే దాన్ని బట్టి మీ మెంటల్ హెల్త్( Mental Health ) ఎలా ఉందో చెప్పవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
అలాగే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనే విషయాలను కూడా చెప్పవచ్చు అని చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి కూడా కలలు వస్తూ ఉంటాయి.
"""/" /
స్వప్న శాస్త్రం( Swapna Shastra ) ప్రకారం ప్రతి కలకి కొంత అర్థం ఉంటుంది.
అంటే నిద్రపోతున్నప్పుడు మీరు చూసే కలలు మీ ముందున్న మంచి మరియు చెడు భవిష్యత్తును సూచిస్తాయి.
ఈ రోజు మీకు కలలో ఎద్దుల బండి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు కలలో ఎద్దుల బండిని చూస్తే మీ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
ఈ కల రాబోయే రోజుల్లో మీరు మంచి విజయాన్ని పొందుతారని సూచిస్తుంది.అంతేకాకుండా కలల శాస్త్రం ప్రకారం కలలో నల్లని మేఘాలు కనిపించడం అశుభం అని పండితులు చెబుతున్నారు.
"""/" /
అలాగే కొందరికి కలలో కాకి కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం ఇది అ శుభమైన కల అని చెప్పవచ్చు.
మీ జీవితంలో పెద్ద విపత్తు జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు.లేదా మీకు సన్నిహితంగా ఉన్నవారి మరణ వార్తలను మీరు వింటారు.
మీరు కలలో రక్తస్రావం చూస్తే జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కల దీర్ఘకాలిక అనారోగ్యాన్ని సూచిస్తుంది.
మీరు లేదా మీ కుటుంబ సభ్యులు సుదీర్ఘ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి కలలో తుఫాన్ ( Cyclone )లేదా ఇల్లు కూలిపోతున్నట్లు చూస్తే అది కూడా అ శుభమైన కలే అని పండితులు చెబుతున్నారు.
స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కల వల్ల మీ అదృష్టం దురదృష్టంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
Breaking News: అగ్నికి ఆహుతైన టాటా ఏస్