వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా కొలిచేది వినాడకుడినే.కోరిన కోర్కెలు తీరుస్తూ.

చేసే పనుల్లో ఎలాంటి ఆటంకం కల్గకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడి పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.

మరి అలాంటి గణేషుడి శరీరంలోని ఒక్కో భాగం ఒక్కో దానికి సంకేతమన్న విషయం మీకు తెలుసా? తెలియక పోయినా పర్లేదండి.

వినాయకుడి గొప్పదనంతో పాటు ఆయన శరీర భాగాలు దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వినాయకుని తొండము ఓం కారానికి సంకేతమని పురాణాలు చెబుతున్నాయి.అలాగే గణేషుడికి చిన్నప్పుడు అతికించిన ఏనుగు తల జ్ఙానానికీ, యోగానికీ చిహ్నంగా వివరిస్తారు.

అంతే కాదండోయ్.మనిషి శరీరము మాయకూ, ప్రకృతికీ సూచికట.

ఆయన తేతిలో ఉన్న పరశువు అజ్ఙానాన్ని ఖండించడానికి సంకేతమట.మరో చేతిలో ఉన్న పాశము విఘ్నాలను కట్టి పడసే సాధనమట.

వినాయకుడి విరిగిన దంతం త్యాగానికి గుర్తని పురాణాలు చెబుతున్నాయి.ఆయన మెడలో ఎప్పుడూ మెరిసే మాల జ్ఙాన సముపార్జనకు గుర్తట.

అలాగే పెద్ద చెవులు భక్తుల కోరికలను వినేందుకట. """/" / ఆ పెద్ద చెవులతో విని వెంటనే కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం.

అలాగే విఘ్నేశ్వరుడి పొట్టపై ఉన్న నాగ బంధము శక్తికి, కుండలినికి సంకేతాలట.ఎప్పుడూ వినాయకుడి పక్కనే ఉండే చిన్నారి ఎలుక జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి అని చెప్పేందుకు నిదర్శనమట.

అంతే కాదండోయ్ ఈయన పక్కనే ఉండే ఆ చిన్నారి ఎలుక ఈ బొజ్జ గణేషుడికి బుజ్జి వాహనం.

అధిక రక్తపోటుతో చింతేలా.. బ్రేక్ ఫాస్ట్ లో దీన్ని చేర్చుకుంటే దెబ్బకు కంట్రోల్ అవుతుంది!