రంగులన్నింటిలో అత్యంత పురాతనమైనది ఏంటో తెలుసా? ఆసక్తికర విషయాలివే..

ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన రంగులు ఏవి అంటే చాలా మంది తెలుపు లేదా నలుపు అనుకుంటారు.

అయితే ఆ రెండు కంటే మరో రంగు అత్యంత పురాతన రంగుగా పేరొందింది.

ఇది ఏ మాత్రం మీరు అస్సలు ఊహించలేరు.ఈ భూమిపై అత్యంత పురాతన రంగుగా గులాబీ రంగు( Pink Color ) పేరొందింది.

దీనిని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కనుగొన్నారు.సుమారు 1.

1 బిలియన్ సంవత్సరాల వయస్సు గల ఈ ప్రకాశవంతమైన గులాబీ రంగు, ఆఫ్రికాలోని సహారా ఎడారిలో లోతైన రాళ్ల నుండి సంగ్రహించబడింది.

"""/" / ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి( Australian National University ) చెందిన పరిశోధకులు నూర్ గునెలీ( Nur Guneli ) ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ రంగు పశ్చిమ ఆఫ్రికాలోని మౌరిటానియాలోని తౌడెని బేసిన్ సముద్ర నల్ల రాయి నుండి తీసుకోబడిందని చెప్పారు.

ఇది గతంలో కనుగొన్న రంగు వర్ణద్రవ్యాల కంటే అర బిలియన్ సంవత్సరాల పురాతనమైనదని వివరించారు.

తమ పరిశోధనల గురించి నూర్ వివరించారు."ఇవి సముద్రంలో నివసించే పురాతన కిరణజన్య సంయోగ జీవులచే ఉత్పత్తి చేయబడిన ప్రకాశవంతమైన గులాబీ రంగు క్లోరోఫిల్ పరమాణు శిలాజాలు.

ఈ జీవులు ప్రస్తుతం ఉనికిలో లేనప్పటికీ చాలా కాలం ముందే ఇవి ఉన్నాయి.

ఒక అధ్యయనం ప్రకారం, శిలాజాల నుండి పొందిన రంగులు ముదురు ఎరుపు నుండి ఊదా వరకు సాంద్రీకృత రూపంలో ఉంటాయి.

అయితే వాటిని ద్రవాలను జోడించడం ద్వారా కరిగించినప్పుడు, అవి ప్రకాశవంతమైన గులాబీ రంగులో మారాయి.

" అని చెప్పారు. """/" / పురాతన రంగుల విశ్లేషణ సుమారు ఒక బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలో ఆహార గొలుసుకు చిన్న సైనోబాక్టీరియా ఆధారమని నిర్ధారిస్తుందని అని నూర్ పేర్కొన్నారు.

ఆ సమయంలో జంతువులు ఎందుకు లేవని వివరించడానికి ఇది సహాయపడింది.అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ లీడ్ రీసెర్చర్ జోచెన్ బ్రోక్స్ దీనిపై స్పందించారు.

ఆల్గే వంటి పెద్ద, చురుకైన జీవుల ఆవిర్భావం బహుశా పెద్ద ఆహార కణాల పరిమిత సరఫరా వల్ల అడ్డంకి కావచ్చని అభిప్రాయపడ్డారు.

సైనోబాక్టీరియా కంటే వెయ్యి రెట్లు పెద్దవని, మైక్రోస్కోప్‌లో వాటిని చూడొచ్చని వివరించారు.

రాజ్ తరుణ్ లావణ్య కేసులో భారీ ట్విస్ట్.. రాజ్ తరుణ్ ను నిందితుడిగా పేర్కొంటూ?