డ్రై రన్ అంటే ఏమిటి ? డ్రై రన్ లో ఎన్ని స్టేజ్స్ ఉంటాయో తెలుసా ?

ప్రపంచ దేశాల ప్రజల మనసులో ఉన్న డౌట్ కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు పని చేస్తుంది అసలు పని చేస్తుందా లేదా ? ఏమైనా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉన్నాయా.

ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా ? కొత్తగా ఏమైనా ఆరోగ్యసమస్యలు వస్తాయా ఇలా ఎన్నో అనుమానాలు ప్రజల అందరి మనసులో ఉన్నాయి.

అలాంటి అపోహలు, అనుమానాలు పోవడానికి అన్నీ దేశాలకు చెందిన ప్రజా ప్రతినిధులు డ్రై రన్ ను నిర్వహిస్తున్నాయి.

అసలు డ్రై రన్ అంటే ఏమిటి అది ఎన్ని స్టేజ్స్ లో ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం డ్రై రన్ అనేది ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం కోసం ఇచ్చే ఓ ట్రైనింగ్ లాంటిది.

ఈ డ్రై రన్ లో నిజమైన వ్యాక్సిన్ ను వాడరు ఓ డమ్మీ వ్యాక్సిన్ ను ఇస్తారు.

వ్యాక్సిన్ ఇచ్చిన రోగిని ఓ అరగంట పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతారు.డ్రై రన్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటే ముందుగా వెయిటింగ్, వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్, ఆ తర్వాత వ్యాక్సినేషన్, చివరికి అబ్జర్వేషన్.

స్టేజ్ వన్: వ్యాక్సినేషన్ లో మొదటి ప్రక్రియ వెయిటింగ్.వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన రోగిని ఓ ప్రత్యేకమైన గదిలో ఉంచి, సోషల్ డిస్టెన్స్ పాటించేలా అన్నీ ఏర్పాట్లు చేస్తారు.

స్టేజ్ టూ : సెకండ్ స్టేజ్ లో వ్యాక్సిన్ ఇచ్చే అఫీసర్ రోగి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న రోగి వివరాలను అడిగి తెలుసుకొని తన దగ్గర ఉన్న వివరాలతో పోల్చి చూస్తాడు.

ఆ రోగి యొక్క వివరాలను ముందుగానే వ్యాక్సినేషన్ అఫీసర్ కు ఆరోగ్య శాఖ నుండి పంపిస్తారు.

"""/"/ స్టేజ్ త్రీ : వ్యాక్సిన్ ఇచ్చే అఫీసర్ సెకండ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి అక్కడ రోగి యొక్క వివరాలను కంప్యూటర్ లో చెక్ చేస్తాడు.

ఆ వివరాలను కోవిడ్ పోర్టల్ కి రిజిస్టర్ చేస్తారు.ఆ తర్వాత రోగి డోస్ తీసుకునేటప్పుడు చెక్ చేసుకునేందుకు వీలుగా ఉండే విధంగా నమోదు చేస్తారు.

స్టేజ్ ఫోర్ : ఇందులో రోగికి వ్యాక్సిన్ గురించి వివరించి ఆ వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను వైద్య సిబ్బంది వివరిస్తుంది.

స్టేజ్ ఫైవ్: వ్యాక్సిన్ పూర్తి అయిన తర్వాత రోగిని ఓ అరగంట పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతారు.

ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకపోతే అక్కడినుండి పంపిస్తారు.

హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే కొత్తిమీర.. ఎలా వాడాలంటే?