చిరంజీవి కి ఇష్టమైన ఎన్టీయార్ సినిమా ఏంటో తెలుసా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా స్టార్ గా చాలా సంవత్సరాల పాటు తన దైన రీతిలో గుర్తింపు పొందుతున్న ప్రభుత్వం ఏకైక హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) అనే చెప్పాలి.
ఈయన చేసిన సినిమాలు మరెవరు చేయలేరు.అనేంతలా ప్రేక్షకులందరిని మ్యాజిక్ చేసిన ఏకైక హీరో కూడా చిరంజీవే కావడం విశేషం.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఒకే ఒక హీరో గా కూడా గుర్తింపు పొందాడు.
"""/" /
ఇక ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే చిరంజీవికి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు అంటే ఇష్టమనే విషయం మనకు తెలిసిందే.
ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అంటే కూడా చిరంజీవికి చాలా ఇష్టం.
అయితే ఆయన చేసిన సినిమాల్లో చిరంజీవికి నచ్చిన సినిమా ఏంటి అని అడగగా చిరంజీవి మాత్రం ఎన్టీయార్ సినిమాల్లో టెంపర్ సినిమా( Temper Movie ) అనెల్తే చాలా ఇష్టమని చెప్పాడు.
అందులో తారక్ యాక్టింగ్ బాగుంటుంది.ముఖ్యంగా కోర్టు సీన్ లో అయితే తన యాక్టింగ్ చాలా బాగుంటుంది.
"""/" /
ఆ సీన్ ను చిరంజీవి రిపీట్ గా చూశానని చెప్పడం విశేషం.
నిజానికి టెంపర్ సినిమా తోనే ఎన్టీఆర్ కి సక్సెస్ వచ్చింది.ఇక అంతకు ముందు వరుస ఫెయిల్యూర్ లో ఉన్న ఎన్టీఆర్ ను పూరి జగన్నాథ్ టెంపర్ సినిమాతో సక్సెస్ ఇచ్చి బయట పడేసాడనే చెప్పాలి.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సక్సెస్ లను కొడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఇక ఇప్పటికే వరుసగా 6 సక్సెస్ లను నమోదు చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఏడవ సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ఇంతకంటే దిగజారి పోవద్దు… డైరెక్టర్ గీతా కృష్ణకు కౌంటర్ ఇచ్చిన కోటి!