పాలల్లో చక్కెర కలిపి తాగుతున్నారా.. అయితే మీరు డేంజర్ లో పడ్డట్లే!

పాలు( Milk ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.

పాలు పోషకాలు పుష్కలంగా ఉండే ఒక ఆహారం.విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, పొటాషియం, అయోడిన్, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు పాలల్లో నిండి ఉంటాయి.

అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది నిత్యం ఒక గ్లాసు పాలు తాగుతుంటారు.

పాలు మన రోగ నిరోధక వ్యవస్థ( Immunity System )ను పటిష్టం గా మారుస్తాయి.

ఎముకలను బలోపేతం చేస్తాయి.మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

మెదడు చురుగ్గా పని చేసేలా ప్రోత్సహిస్తాయి.స్ట్రోక్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.

ఇలా చెప్పుకుంటే పోతే పాలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. """/"/ అయితే ఎక్కువ శాతం మంది చేసే పొరపాటు ఏంటంటే.

పాలల్లో చక్కెర( Milk With Sugar ) కలిపి తాగ‌డం.ఈ అలవాటు మీకు ఉందా.

అయితే మీరు డేంజర్ లో పడ్డట్లే.తెల్లగా చాలా ఆకర్షణీయంగా కనిపించే చక్కెర( Sugar ) ఎంతో మధురంగా ఉంటుంది.

కానీ చక్కెరలో ఎటువంటి పోషకాలు ఉండవు పైగా ఆరోగ్యానికి చక్కెర అత్యంత హానికరం.

ప్రాసెస్ చేయ‌డం వ‌ల్ల చ‌క్కెర‌లో పోషకాలన్ని పూర్తిగా నశిస్తాయి.అలాగే టేస్ట్ కోసం వివిధ రసాయనాలను జోడిస్తారు.

అందువ‌ల్ల చ‌క్కెర ప్రాసెస్ చేసే క్రమంలో ఒక తెల్లటి విషంలా మారిపోతుంది.చక్కెర విషమని తెలిసినా కూడా మన దేశంలో దాని వినియోగం మాత్రం తగ్గడం లేదు.

ఇకపోతే పాలల్లో చక్కెర కలిపి తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. """/"/ చక్కెర మరియు పాల కలయికలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

ఈ కేల‌రీల‌ను మన శ‌రీరానికి ఎక్క‌డ నిల్వ చేయాలో తెలియ‌దు.దాంతో అది కొవ్వుగా మారి పొత్తికడుపుతో స‌హా శరీరంలోని వివిధ భాగాలలో స్టోర్ అవుతుంది.

ఫ‌లితంగా ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.శ‌రీర బ‌రువు అదుపు త‌ప్పిందంటే అనేక రోగాల‌కు ఆహ్వానం చెబుతున్నట్లే.

ముఖ్యంగా అధిక బ‌రువు( Overweight ) వ‌ల్ల మ‌ధుమేహం, ర‌క్త‌పోటు, గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ భారీగా పెరుగుతుంది.

కాబ‌ట్టి ఈ స‌మ‌స్య‌ల‌న్నిటికీ దూరంగా ఉండాలి అనుకుంటే పాల‌ల్లో చ‌క్కెర క‌లిపి తాగే అల‌వాటును వ‌దులుకోండి.

కావాలంటే చక్కెర‌కు బ‌దులుగా మీరు బెల్లం లేదా తేనెను ఎంచుకోవ‌చ్చు.చ‌క్కెర కంటే బెల్లం మ‌రియు తేనె ఆరోగ్యానికి అత్యంత శ్రేష్ట‌క‌రం.

ఈ వారం ఓటిటి లవర్స్ కు పండుగే.. దేవరతో పాటు పలు సినిమాలు స్ట్రీమింగ్