గులాబీ టీ తాగడం వల్ల ఏమౌతుందో తెలుసా…!

చాలా మందికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.

అంతేకాకుండా పోషక పదార్ధాలు తక్కువగా ఉండే ఆహారం ను తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అంతగా ఉండదు.

దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి తీసుకొనే ఆహార పదార్థాల్లో నే కాకుండా సహజంగా దొరికే చెట్ల పువ్వుల ద్వారా తయారయ్యే టీ ను తీసుకోవడం వల్ల పోషకాలను అందుకోవచ్చు.

అవేంటో చూద్దాం.గులాబీ టీ: ఈ టీ ను తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీర ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

దీనికి కావలసిన పదార్థాలు 3 ఎండిన గులాబీలు, టీ స్పూన్ గులాబీ నీరు, అర టీ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక లీటర్ మంచినీళ్లు,2 గ్రీన్ టీ బ్యాగులు.

ముందుగా పావు లీటర్ నీటిని బాగా మరిగించి గులాబీ రెక్కల తో పాటు నిమ్మరసం వేయాలి.

తరువాత ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు చల్లార్చాలి.ఇలా నానిన గులాబీ రేకులను వడ కట్టాలి.

తర్వాత ఇందులో టీ బ్యాగులు వేసి బాగా మరిగించాలి.తర్వాత వాటిని తీసి తేనె గులాబీ నీరు వేసి కలిపి తీసుకోవాలి.

"""/" / శంకు పువ్వులు: ఈ టీ తాగడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది.

మెదడు పనితీరు మెరుగుపడుతుంది.కావలసిన పదార్థాలు: అర కప్పు ఈ పువ్వుల రేకలు, టేబుల్ స్పూన్ తేనె, ఒక నిమ్మచెక్క, రెండు కప్పుల నీళ్లు.

ముందుగా నీళ్లను మరిగించి అందులో ఈ రేకలను వేయాలి.తక్కువ మంటతో మరిగిస్తే రంగు దిగుతుంది.

తర్వాత ఈ నీటిలో తేనె కలిపితే తేనీరు తయారవుతుంది.తర్వాత అందులో నిమ్మరసం పిండుకొని తాగేయాలి.

గోంగూర పువ్వు: దీనివల్ల విటమిన్ ఎ,సి, ఐరన్, కాల్షియం ఉంటాయి.అంతేకాకుండా శరీర వాపును తగ్గిస్తాయి.

కావలసిన పదార్థాలు: ఎండిన 6 గోంగూర పూలు, రెండు కప్పుల నీళ్లు, రెండు టేబుల్ స్పూన్ల తేనె.

నీళ్లను బాగా మరిగించి దాంట్లో గోంగూర రేకలను వేయాలి.స్టవ్ ఆపేసి ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి.

చివరగా తేనె కలిపి తాగాలి.

దారుణం.. లోకో పైలట్ దారుణ హత్య చేసిన దుండగుడు(వీడియో)