ఇందిరా ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా..?
TeluguStop.com
సనాతన ధర్మం( Sanatana Dharma )లో ప్రతి ఏడాది 24 ఏకాదశిలు ఉంటాయి.
అయితే అశ్విని మాసంలోనీ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది.
ఈ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని కూడా అంటారు.అయితే పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ని పూజించడం ద్వారా స్వామి సంతృప్తి చెందుతారని, ఆ రోజు పూర్వీకులకు శ్రాద్ధం పెట్టడం ద్వారా పితృదేవతలకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలలో ఉంది.
ఇందిరా ఏకాదశి అక్టోబర్ 10వ తేదీన వస్తూ ఉంది.అలాగే ఏకాదశి పితృ పక్షంలో వస్తుంది.
కాబట్టి ఈ ఏకాదశి ప్రాముఖ్యత మరింత పెరిగింది. """/" /
అలాగే ఇందిరా ఏకాదశి వ్రతం రోజు పూర్వీకుల శ్రాద్ధం చేయడం ద్వారా పితృదేవతలకు వైకుంఠధామం లభిస్తుందని శాస్త్రాలలో ఉంది.
ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల పూర్వికులు తృప్తి పొందుతారు.
ఇంకా చెప్పాలంటే ఇందిరా ఏకాదశి తిధి అక్టోబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు మొదలై అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 8వ తేదీన ఉదయం 10 గంటల 9 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1:12 నిమిషములకు విష్ణుమూర్తిని ఆరాధించడానికి అనువైన సమయం అని కూడా నిపుణులు చెబుతున్నారు.
"""/" /
అలాగే అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 10 గంటల ఆరు నిమిషాల నుంచి 19వ తేదీన రాత్రి 11 గంటలకు ఈ ఉపవాసం ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఇందిరా ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను పురాణాలలో వెల్లడించారు.ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల ఏడు తరాల వరకు పూర్వీకులకు మోక్షం లభిస్తుందని పండితులు( Scholars ) చెబుతున్నారు.
అలాగే వారికి వైకుంఠధామం లభిస్తుందని కూడా చెబుతున్నారు.
ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. ఇన్ని హిట్ సినిమాలు రిలీజవుతున్నాయా?