బ్రహ్మ ముహూర్తంలో చేయకూడని పనులు ఏంటో తెలుసా?

మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను నమ్ముతాము.ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కొందరు కొన్ని రకాల పనులను చేస్తుంటారు.

బ్రహ్మ ముహూర్తం శుభకార్యాలకు ఎప్పుడు మంచిదని బ్రహ్మ ముహూర్తానికి ఏ విధమైనటువంటి వారం తిథులు లేవని పండితులు చెబుతున్నారు.

బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేయడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి.

ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు.

 ఈ సమయంలో చేసే పనులు విజయాలను అందిస్తాయని చెబుతుంటారు.అయితే ఎంతో పవిత్రమైన ఈ బ్రహ్మ ముహూర్తంలో కొన్ని పనులను చేయకూడదని పండితులు చెబుతున్నారు.

చాలామంది సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోతుంటారు.ఇలా అలా సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదు అని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తానికి ముందుగానే నిద్ర లేవాలంటే పండితులు చెబుతున్నారు.

ఈ సమయంలో నిద్ర లేచి ధ్యానం యోగ పూజ వంటి కార్యక్రమాలను చేయాలి.

"""/"/ అదే విధంగా బ్రహ్మ ముహూర్తంలో లేచి విద్యార్థులు చదువుకోవడం వల్ల వారు చదువుకున్నది తొందరగా అర్థం చేసుకొని పరీక్షలలో మంచి విజయం సాధిస్తారని చెబుతారు.

ఇలా బ్రహ్మ ముహూర్తంలో అన్ని మంచి పనులను చేయాలి.ఇక బ్రహ్మ ముహూర్తంలో భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనకూడదని, ఇలా ఎంతో పవిత్రమైన ముహూర్తంలో భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని పండితులు తెలియజేస్తున్నారు.

ట్రైకోడెర్మా విరిడి తో పంటలకు ఆశించే తెగుళ్ళకు చెక్..!