రోజుకు పది నల్ల ఎండు ద్రాక్ష తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
TeluguStop.com
ఎండు ద్రాక్ష( Raisins )లో మనకు చాలా రకాలు ఉన్నాయి.అందులో నల్ల ఎండు ద్రాక్ష కూడా ఒకటి.
అయితే నల్ల ఎండు ద్రాక్షను చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు.వాటిని పెద్దగా తినేందుకు ఇష్టపడరు.
కానీ నల్ల ఎండు ద్రాక్ష మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది.నల్ల ఎండు ద్రాక్షలో జింక్, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్, రిబోఫ్లావిన్, థయామిన్ వంటి విటమిన్స్, డైటరీ ఫైబర్, ప్రోటీన్ తో సహా అనేక పోషకాలు నిండి ఉంటాయి.
పది చొప్పున ఎండు ద్రాక్షలను వాటర్ లో వేసి నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి.
నీటిలో నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు రెట్టింపు అవుతాయి మరియు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
"""/" /
ముఖ్యంగా నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇది ప్రేగులను క్రమబద్ధీకరించడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.
అదే సమయంలో జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.అలాగే నల్ల ఎండుద్రాక్షలో మెండుగా ఉండే పొటాషియం రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
నల్ల ఎండుద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.వాపును తగ్గిస్తాయి.
"""/" /
ఏజ్ పెరిగినా మీ బోన్స్ స్ట్రోంగ్ గా ఉండాలంటే మీరు నిత్యం నల్ల ఎండు ద్రాక్ష తినాల్సిందే.
ఎందుకంటే, నల్ల ఎండుద్రాక్షలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది బలమైన ఎముకలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
అలాగే నల్ల ఎండు ద్రాక్షలో అధిక మొత్తంలో ఐరన్ కంటెంట్ ఉంది.ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మరియు ఆక్సిజన్ రవాణాలో ఇది కీలక పాత్రను పోషిస్తుంది.
అంతేకాదండోయ్ నిత్యం పది చొప్పున నల్ల ఎండు ద్రాక్షను తింటే.అందులో ఉండే విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో హెల్ప్ చేస్తాయి.
చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా మెరిపిస్తాయి.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటున్నాయి.
ఆరోగ్యకరమైన, దృఢమైన జుట్టును ప్రోత్సహిస్తాయి.రోగ నిరోధక శక్తి( Immunity )ని పెంచుతాయి.
పైగా ప్రతి రోజూ నల్ల ఎండు ద్రాక్షను తింటే నిద్ర నాణ్యత కూడా అద్భుతంగా పెరుగుతుంది.
గుండె మంట, ఛాతీ మంట, నోటి పూత వంటి సమస్యలు పరార్ అవుతాయి.
భారతదేశంలో భరించలేని పరిస్థితులు.. జపనీస్ టూరిస్ట్ కన్నీటి పర్యంతం!