చలికాలంలో కాకరకాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

కాకరకాయ( Bittergourd ).పేరు వింటేనే చాలా మందికి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి.

కారణం దాని రుచి.కాకరకాయ చేదుగా ఉండటం వల్ల ఎక్కువ శాతం మంది దాన్ని తినేందుకు ఇష్టపడదు.

కానీ కాకరకాయలో మన ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన‌ పోషకాలు దండిగా ఉంటాయి.

కాకరకాయను దూరం పెడితే ఆ పోషకాల‌న్నిటిని కోల్పోయినట్లే.ఇకపోతే చలికాలంలో తినదగ్గ కూరగాయల్లో కాకరకాయ ఒకటి.

ఎందుకంటే, ఈ సీజన్ లో కాకరకాయ ఆరోగ్యానికి కొండంత అండగా ఉంటుంది.చలికాలంలో సాధారణంగా వచ్చే అంటు వ్యాధులతో పోరాడటానికి కాకరకాయ రసం ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.

అలాగే వింట‌ర్ సీజ‌న్( Winter Season ) లో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి.

వాటికి కాకరకాయ సమర్ధవంతంగా చెక్ పెడుతుంది.కాకరకాయ అజీర్ణం, మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా కు మద్దతు ఇస్తుంది. """/" / కాకరకాయ అనేది విటమిన్ ఎ( Vitamin A ) మరియు విటమిన్ సితో సహా పోషకాలు మరియు విటమిన్లతో నిండిన కూరగాయ.

ఇది యాంటీ ఆక్సిడెంట్లకు( Antioxidants ) కూడా మంచి మూలం.కాకరకాయను ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

చలికాలంలో వివిధ చర్మ‌ సమస్యల నుంచి రక్షించడానికి కూడా కాకరకాయ తోడ్పడుతుంది. """/" / అంతేనా అనుకుంటే పొర‌పాటే అవుతుంది.

ఎందుకంటే కాలేయాన్ని శుభ్రపరచడానికి మరియు కాలేయ ఎంజైమ్‌లను పెంచడానికి కాకరకాయ రసం సహాయపడుతుంది.

కాక‌ర‌కాయ‌లో ఐరన్ మరియు ఫోలేట్ అధికంగా ఉంటాయి.ర‌క్త‌హీన‌త తో బాధ‌ప‌డుతున్న‌వారు వారానికి ఒక‌సారి కాక‌ర‌కాయ ర‌సం తాగితే శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ పెరుగుతాయి.

ర‌క్త‌హీన‌త ప‌రార్ అవుతుంది.ఇక ర‌క్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ‌డంలో, జీవక్రియను మెరుగుప‌ర‌చ‌డంలో, శ్వాస కోశ సమస్యలను దూరం చేయడంలో కూడా కాకరకాయ తోడ్పడుతుంది.

సో.ఇక‌పై కాక‌ర‌కాయ క‌న‌ప‌డితే అస్స‌లు వ‌దిలిపెట్ట‌కండి.

ఈ రెస్టారెంట్‌ మెనూ ప్రపంచంలోనే ఖరీదైనది.. ధర చూస్తే ఫ్యూజులు ఔట్.. ఎక్కడుందంటే..?