ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
TeluguStop.com
నాన్ వెజ్ వంటల్లో, బిర్యానీ పులావ్ ( Biryani Pulao )వంటి స్పెషల్ రైస్ ఐటమ్స్ లో కొత్తిమీరను విరివిగా వాడుతుంటారు.
ఆహారం రుచిని పెంచడంలో ప్రత్యేకమైన ఫ్లేవర్ ను జోడించడంలో కొత్తిమీర అద్భుతంగా సహాయపడుతుంది.
అంతేకాదు కొత్తిమీరలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ నిండి ఉంటాయి.అందువల్ల ఆరోగ్యానికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ ( Coriander Juice )తాగితే అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
పైగా కొత్తిమీర ను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ ( Lemon Juice )మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని తేనె కలిపి ఖాళీ కడుపుతో సేవించాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా కొత్తిమీర జ్యూస్ తాగితే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.
"""/" /
మధుమేహంతో బాధపడుతున్న వారికి కొత్తమీర జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఎందుకంటే కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.అందుకోసం చక్కెర వ్యాధి ఉన్నవారు ఖాళీ కడుపుతో తేనె కలపకుండా కొత్తమరీ జ్యూస్ ను తీసుకోవాలి.
అలాగే కొత్తిమీర జ్యూస్ శరీరం నుండి అదనపు సోడియంను ఫ్లష్ చేస్తుంది.అధిక రక్తపోటు సమస్యను అదుపులోకి తెస్తుంది.
"""/" /
ఖాళీ కడుపుతో టీ, కాఫీ( Tea, Coffee ) తాగే బదులు కొత్తిమీర జ్యూస్ ను తీసుకుంటే మీ మెదడు రెట్టింపు వేగంతో పని చేస్తుంది.
అల్జీమర్స్ మరియు మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి మెదడు వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.