ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఏం అవుతుందో తెలుసా?
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానియాల్లో కాఫీ ( Coffee )ఒకటి.చాలా మంది కాఫీతో ప్రత్యేకమైన కనెక్షన్ ను ఏర్పర్చుకుంటారు.
మనసుని పరవశంగా మార్చే కాఫీని ఒక ఎమోషన్ గా భావిస్తుంటారు.ముఖ్యంగా ఉదయాన్నే పని మొదలెట్టే ముందు ఓ కప్పు కాఫీ అంటే అది లైఫ్ స్టార్ట్ బటన్ లాంటిదే.
అయితే ఎక్కువ శాతం మంది చేసే పొరపాటు ఏంటంటే.కాఫీని ఖాళీ కడుపుతో తాగడం.
మీకు కూడా ఈ అలవాటు ఉంది.? అయితే వెంటనే దాన్ని వదులుకోండి.
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.ఖాళీ కడుపుతో కాఫీ తాగితే అందులో ఉండే కెఫిన్, స్టమక్‌లో ఆమ్ల స్రావాన్ని పెంచుతుంది.
ఇది గ్యాస్ట్రిక్ ఇర్రిటేషన్‌కి దారి తీస్తుంది.ఫలితంగా గ్యాస్, ఎసిడిటి( Gas, Acidity ), గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ అస్థిరంగా మారతాయి.ఇది ఊపిరాడకపోవడం, వికారం వంటి ప్రభావాలు కలిగించవచ్చు.
"""/" /
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అందులోని కెఫిన్ శరీరంపై వేగంగా ప్రభావం చూపుతుంది.
దీనివల్ల కొందరికి టెన్షన్, చేతులు వణకటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలను కలిగిస్తాయి.
సున్నితమైన కడుపు ఉన్నవారు ఖాళీ కడుపుతో కాఫీ తాగితే వికారం, విరేచనాలు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కాబట్టి సాధ్యమైనంతవరకు ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మానుకోండి.ఉదయం పూట ఏదైనా చిన్న మొత్తంలో తిన్నాక కాఫీ తాగడం ఉత్తమం.
"""/" /
మితంగా కాఫీని తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ( Health Benefits )ఉన్నాయి.
ముఖ్యంగా కాఫీ మానసిక చురుకుతనాన్ని పెంచుతుంది.మూడ్ ను మెరుగుపరుస్తుంది.
మితంగా కాఫీ తీసుకునేవారిలో పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుందని ఓ రీసెర్చ్ లో తేలింది.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం నియంత్రించడంలో ఉంటాయి.