చ‌లి కాలంలో సన్‌స్క్రీన్ రాసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

ప్ర‌స్తుతం చ‌లి కాలం కొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో చ‌లితో పాటుగా ఆనారోగ్య స‌మ‌స్య‌లు, చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.

ముఖ్యంగా చ‌ర్మం విష‌యానికి త‌ర‌చూ పొడి బారిపోవ‌డం, చ‌ర్మం ప‌గుళ్లు, స్కిన్ రాషెస్‌, దుర‌ద‌లు ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.

అందుకే ఈ సీజ‌న్‌లో చ‌ర్మంపై అధిక శ్ర‌ద్ధ వ‌హించాల్సి ఉంటుంది.అయితే ఈ సీజ‌న్‌లో చాలా మంది మాయిశ్చరైజర్లు వాడుతుంటారు.

సన్ ‌స్క్రీన్ లోషన్స్‌ను మాత్రం దూరం పెడ‌తారు.ఎండ నుంచి చర్మాన్ని క‌వ‌చంలా కాపాడే స‌న్ స్క్రీన్ లోష‌న్లు స‌మ్మ‌ర్‌లో ఎక్కువ‌గా వాడ‌తారు.

ఈ కాలంలో భానుడి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంటుంది.దాని ప్ర‌భావం చర్మంపై ప‌డ‌కుండా సన్ స్క్రీన్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే వింట‌ర్ వ‌చ్చే స‌రికి వాటిని ప‌క్క‌న పాడేస్తారు.కానీ, చ‌లి కాలంలో కూడా స‌న్ ‌స్క్రీన్ లోష‌న్ చ‌ర్మానికి రాసుకోవాల‌ని బ్యూటీష‌న్లు చెబుతున్నారు.

ఎందుకంటే, వింట‌ర్ సీజ‌న్‌లో కూడా చ‌ర్మానికి సన్ స్క్రీన్ లోషన్లు అనేక విధాలుగా మేలు చేస్తాయి.

"""/" / రెగ్యుల‌ర్‌గా స‌న్ స్క్రీన్ లోష‌న్లు రాసుకోవ‌డం వ‌ల్ల‌.చ‌ర్మంపై ఉన్న ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

దాంతో వయసు పైబడినా యంగ్‌గా క‌నిపించ‌వ‌చ్చు.అలాగే ప్ర‌తి రోజు స‌న్ స్క్రీన్ లోష‌న్లు రాసుకోవ‌డం వ‌ల్ల‌.

చ‌ర్మానికి కొల్లాజెన్, కెరాటిన్ వంటి పోష‌కాలు అందుతాయి.ఫ‌లితంగా చ‌ర్మం పొడి బార‌డం త‌గ్గి.

ఎల్ల‌ప్పుడూ మృదువుగా ఉంటుంది.అదేవిధంగా, స‌న్ స్క్రీన్ లోష‌న్‌ ఎండ మ‌రియు అతినీలలోహిత కిరణాల నుంచి ర‌క్షించ‌డ‌మే కాదు.

దుమ్ము, ధూళి, కాలుష్యం, మురికి వంటి వాటి నుంచి కూడా చ‌ర్మాన్ని కాపాడుతుంది.

మ‌రియు ప్ర‌తి రోజు స‌న్ స్క్రీన్ లోష‌న్ రాసుకోవ‌డం వ‌ల్ల‌.చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా కూడా మారుతుంది.

అయితే త‌మ చ‌ర్మ త‌త్వాన్ని బ‌ట్టీ.స‌న్ స్క్రీన లోష‌న్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

అమ్మ బాబోయ్.. పుష్ప-2 పాటకు బామ్మ ఊర మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్..