కాలి వేళ్లలో బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమవుతుందొ తెలుసా..?!

మీరు ఎప్పుడైనా మీ కాలి వేళ్ళను నిశితంగా పరిశీలించారా.?! నిశితంగా పరిశీలిస్తే కాలికి ఉన్న వేళ్ళు ఒక దాని తర్వాత ఒకటి పొడవు తగ్గుతూ ఉండటం గమనిస్తాము.

అయితే కొంతమంది కాలి వేళ్ళు వేరుగా ఉండటం కూడా మనం గమనిస్తూ ఉంటాము.

కాకపోతే కొంతమంది అమ్మాయిలకి కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం.

ఇలా ఉన్న వారి గురించి కొంత మంది కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనం వినే ఉంటాం.

మరి అది ఎంతవరకు నిజం లేదా అనేది ఒక సారి చూద్దాం.ఇకపోతే ఆడవారి కాలివేళ్ల కంటే బొటన వేలు పెద్దగా ఉంటే అలాంటి వారు చాలా తెలివితేటలు గలవాడిని అలాగే వారు మంచి సృజనాత్మకత కలిగి ఉంటారు.

అంతేకాదు మీరు ఎటువంటి పనినైనా సరే చాలా సులువుగా చేయడమే కాకుండా ప్రతి పనిలో కూడా ముందుంటారు.

ఒకవేళ కాలి రెండవ వేలు బొటనవేలు కంటే కాస్త పొడవుగా ఉండే వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

అలాంటివారు చాలా ధైర్యంగా ఉండడమే కాకుండా ప్రక్క వారిని కూడా తమతో పాటు ధైర్యంగా ఉండేలా చూస్తారు.

ఇలాంటి వారు కొత్త వ్యక్తులతో చాలా సులువుగా కలిసిపోతారు.అలాగే కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి ఆ తర్వాత చివరి రెండు వేళ్ళు చిన్నగా ఉన్నట్లయితే వారు చాలా మానసికంగాను, శారీరకంగా దృఢంగా ఉంటారు.

వీరు ఎటువంటి పనినైనా సరే చాకచక్యంగా పూర్తి చేస్తారు.అలాగే బొటనవేలు పక్కనున్న వేలు బొటన వేలుకాస్త చిన్నగా ఉంటే వారు జీవితాన్ని ఎంతగానో సుగుమంగా ముందుకు తీసుకెళ్తారని, అలాంటి వారు పని ఎంత భారంగా ఉన్న చాలా సులువుగా చేసుకోగలరు.

అంతేకాదు ప్రేమించిన మనిషిని ఎంతగానో సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు.అంతేకాకుండా బొటన వేలు మినహాయించి మిగతా నాలుగు వేళ్ళు సమానంగా ఉంటే వారి కుటుంబానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తారు.

అంతేకాదు వీరు ఎదుటి వారు చెప్పే మాటలను విని వాటిని పాటించడానికి ప్రయత్నిస్తారు.

తెలుగు తేజం చిన్నారి కలశకు ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా గుర్తింపు