వంకాయతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలేంటో తెలుసా?
TeluguStop.com
కూరగాయల్లో రారాజు వంకాయ(brinjal).ఇంగ్లీషులో బ్రింజాల్(brinjal).
కొందరు వంకాయను చాలా ఇష్టంగా తింటుంటారు.మరి కొందరు వంకాయ వంక కూడా చూడరు.
ఆరోగ్యపరంగా చూస్తే వంకాయ మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.వంకాయలో పొటాషియం, మెగ్నీషియం(Potassium, Magnesium) అధికంగా ఉండడం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
కేలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయల్లో వంకాయ ఒకటి.అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి వంకాయ తినదగ్గ కూరగాయ.
వంకాయలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
వంకాయలో ఉండే క్యాల్షియం మరియు విటమిన్ కె ఎముకలను దృఢంగా(Calcium And Vitamin K Keep Bones Strong.
) మార్చడంలో తోడ్పడతాయి.అంతేకాకుండా వంకాయ మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.
మెదడు చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని వైరస్ బ్యాక్టీరియాల నుంచి రక్షించడంలో కూడా వంకాయ సహాయపడుతుంది.
"""/" /
అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ వంకాయను మితంగా తీసుకోవాలి.
అలాగే వంకాయతో కొన్ని కొన్ని ఆహారాలు అస్సలు తినకూడదు.ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది పాలు (Milk)మరియు పాల ఉత్పత్తులు(Dairy Products).
వంకాయ వాతదోషాన్ని పెంచే లక్షణం కలిగి ఉంటుంది, పాలు శీతల స్వభావం కలిగి ఉంటాయి.
వీటిని కలిపి తింటే జీర్ణ సమస్యలు, అలర్జీలు రావచ్చు. """/" /
వంకాయ, టమాటో (Ebrinjal?, Tomato)కలిపి తీసుకోకూడదు.
వంకాయలో నైట్రేట్లు, ఆక్సలేట్లు ఉంటాయి, ఇవి టమోటాతో కలిసినప్పుడు ఎక్కువ ఆమ్లతను కలిగించవచ్చు.
అలాగే వంకాయ సహజంగానే ఒంట్లో హీట్ ను ప్రేరేపిస్తుంది.అందువల్ల మసాలా పదార్థాలతో వంకాయను కలిపి తీసుకోకూడదు.
అలా తీసుకుంటే తలనొప్పి, విపరీతంగా చెమట పట్టడం, తలతిరగడం, కండరాల నొప్పులు(Dizziness, Muscle Aches) వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఇక వంకాయ మరియు చేపను కలిపి తినకూడదు.ఎందుకంటే ఈ కాంబినేషన్ జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.