వారంలో ఈ రోజుల లో ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా..?

ఆరోగ్యం బాగా లేకపోయినా ఏ పని చేసినా కలిసి రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు.

ఏ పని మొదలుపెట్టిన పూర్తి కాకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు కొంతమంది జ్యోతిష్య నిపుణుల( Astrologers ) సలహా తీసుకుంటూ ఉంటారు.

వారు మన పుట్టిన తేదీ, నక్షత్రం, జాతకం ప్రకారం గా మీరు ఏ రంగు వస్తువులు ఉపయోగించకూడదు.

ఏ రోజు ఏ రంగు బట్టలు ధరించాలో చెబుతూ ఉంటారు.ఒక్కో రంగు ఒక్కో గ్రహానికి సంబంధించినది.

వారంలో ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు డ్రెస్ ను ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఆదివారం రోజు గ్రహాల రాజు సూర్యుడికి చెందిన రోజు.

"""/" / కాబట్టి ఈ రోజున సూర్య భగవానుడి అనుగ్రహం( Lord Surya ) పొందడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి.

ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సూర్య భగవానునితో పాటు అన్ని గ్రహాల ఆశీర్వాదం లభిస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం తెల్లటి దుస్తులను ధరించడం మంచిది.తెలుపు రంగు చంద్రునికి తో సంబంధం కలిగి ఉంటుంది.

కాబట్టి ఈ రోజున తెల్లటి రంగు దుస్తులు ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల అంగరక గ్రహం అనుకూలంగా ఉంటుంది.

"""/" / అలాగే హనుమంతుడి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయనీ నిపుణులు చెబుతున్నారు.అలాగే బుధవారం రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలని గ్రంథాలలో ఉంది.

ఇంకా చెప్పాలంటే గురువారం రోజు పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది.ఇలా చేయడం వల్ల బృహస్పతి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది.

శుక్రవారం రోజున ఎరుపు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

అలాగే శనివారం రోజు శనీశ్వరుడికి చెందిన రోజు.కాబట్టి ఈ రోజున నీలం లేదా మధురు రంగు దుస్తులను ధరించాలి.

ఈ ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. తెలుసా?