హీరో ఆది భార్య అరుణ కోరిక ఏంటో తెలుసా… ఈ కోరిక కూడా ఆది తీర్చలేకపోయాడా?
TeluguStop.com
ఇండస్ట్రీలోకి సాయికుమార్( Saikumar ) వారసుడిగా ప్రేమకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆది సాయికుమార్.
ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఆది సాయికుమార్ ( Aadi Saikumar ) అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.ఇలా ఆది నటించిన సినిమాలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఈయన మాత్రం హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇక ఆది అరుణ( Aruna ) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. """/" /
ఇక ఈ దంపతులు మొదటిసారి ఓ బుల్లితెర కార్యక్రమానికి హాజరయ్యారు.
వెన్నెల కిషోర్ బ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలా మొదలైంది కార్యక్రమంలో భాగంగా ఆది సాయికుమార్ తన భార్య అరుణతో కలిసి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు ఎన్నో విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .
ఈ క్రమంలోనే అరుణ ఆది గురించి మాట్లాడుతూ ముందు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన అబ్బాయని తెలియడంతో కంగారు పడ్డాను కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆదికి తాను ఒక కండిషన్ పెట్టానని తెలిపారు.
తాను సినిమాలలో నటించిన ఎక్కువగా లిప్ లాక్ సన్నివేశాలలో నటించకూడదని కండిషన్ పెట్టానని అరుణ తెలిపారు.
"""/" /
ఇక ఆది తనకు పెద్దగా గిఫ్ట్స్ ఏమీ ఇవ్వరని కానీ ఒకసారి మాత్రం స్పెషల్ గా బ్యాగు ఆర్డర్ చేయించి ఆ బ్యాగు పై ఏ ఏ అనే లెటర్స్ పెట్టించి ఆ బ్యాగు తనకు గిఫ్ట్ గా ఇచ్చారని తెలిపారు.
ఇక తనకు ఏదైనా కోరిక ఉంది అంటే అది కేవలం ఆది ఆమ్లెట్ వేస్తే తినాలని కోరిక మాత్రమే ఉందంటూ అరుణ తెలిపారు.
ఆది చేతుల మీదుగా ఆమ్లెట్( Omlet ) తినాలని కోరిక ఉందని తెలియడంతో కనీసం ఈ కోరిక కూడా ఆది తీర్చలేకపోయారా అని అందరూ భావించారు.
కానీ వెన్నెల కిషోర్ ( Vennela Kishore ) మాత్రం షోలోనే ఆదిచేత ఆమ్లెట్ వేయించి తన భార్యకు తినిపించారు.
ఇలా వెన్నెల కిషోర్ కారణంగా అరుణ కోరిక నెరవేరిందని చెప్పాలి అయితే ఈ విషయం తెలిసినటువంటి నేటిజన్స్ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? మరి ఇంత చిన్న చిన్న కోరికలు ఉన్నవారు కూడా ఉంటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
చాక్లెట్ ప్లేన్‌గా ఉందని కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ అతనికి చెల్లించిన నష్టపరిహారం ఎంతంటే..?