మెనోపాజ్ దశలో ఆ కోరికలు తగ్గడానికి ప్రధాన కారణాలేంటో తెలుసా?
TeluguStop.com
లైంగిక కోరికలు తగ్గి పోవడం.మెనోపాజ్ దశలో దాదాపు స్త్రీలందరూ ఎదుర్కొనే సమస్యల్లో ఇదీ ఒకటి.
మెనోపాజ్ దశలో స్త్రీ శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి తగ్గి పోతుంది.లైంగిక కోరికలు తగ్గడానికి ఇది ప్రధాన కారణం.
అలాగే ఈ సమయంలో తీవ్రంగా వేధించే ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, ఆలసట, నీరసం, వెజైనా డ్రైగా మారడం వంటివి కూడా లైంగిక వాంఛలు తగ్గడానికి కారణం అవుతుంటాయి.
అయితే కారణం ఏదైనా ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలు తీసుకుంటే.మెనోపాజ్ దశలో తగ్గిపోయే ఆ కోరికలను సులభంగా పెంచుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
మరి ఆ జాగ్రత్తలు ఏంటో చూసేయండి. """/"/
మెనోపాజ్ దశలో లైంగిక కోరికలు పెరగాలంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎంతో అవసరం.
అందుకే స్త్రీలు ఆ సమయంలో అవిసె గింజలు, సోయా ఉత్పత్తులు, స్ట్రాబెర్రీ పండ్లు, గ్రీన్ టీ, బ్లాక్ టీ, నువ్వులు వంటివి తీసుకుంటే ఈస్ట్రోజన్ హోర్మోన్ స్థాయిలు పెరుగుతాయి.
అలాగే పైన చెప్పుకున్నట్టు ఒత్తిడి కూడా మెనోపాజ్ దశలో లైంగిక కోరికలు తగ్గడానికి ఓ కారణం.
అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.అందు కోసం ధ్యానం, యోగా వంటివి చేయాలి.
మెనోపాజ్ దశలో కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా సైతం లైంగిక వాంఛను పెంచుకోవచ్చు.
అటువంటి ఆహారాల్లో డార్క్ చక్లెట్స్, చికెన్, పాలు, పెరుగు, గుడ్లు, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, అవకాడో, ఆప్రికాట్లు, అరటి పండ్లు, పీనట్ బటర్, బచ్చలి కూర, బీన్స్ వంటివి ముందు వరసలో ఉంటాయి.
కాబట్టి, వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిది. """/"/
ఇక మెనోపాజ్ దశలో చాలా మంది స్త్రీలు వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తారు.
కానీ, లైంగిక కోరికలను పెంచుకోవాలనుకుంటే.రోజు కనీసం పావు గంటైనా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.
అదే సమయంలో మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను నివారించుకోవాలి.బరువును అదుపులో ఉంచుకోవాలి.
వాటర్ ఎక్కువగా సేవించాలి.మరియు ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.