వైకుంఠనాధుడు రథంపై వచ్చిన క్షేత్రం ఏంటో తెలుసా?
TeluguStop.com
భగవాన్ శ్రీ మహా విష్ణువు వైకుంఠం నుంచి తన రథంతో భూమిపై దిగి వెలసిన మహా పుణ్యక్షేత్రం కుంభకోణం.
తమిళనాడులోని ఆలయాల నగరమైన కుంభకోణంలో శివ, కేశవులకు అనేక ఆలయాలు ఉన్నాయి.శేషశయనుడు స్వయంగా వెలసిన క్షేత్రం ఇదేనని ఆళ్వారుల గ్రంథాలు వెల్లడిస్తున్నాయి.
తిరుపతి, శ్రీరంగం తరువాత అంతటి పుణ్య క్షేత్రమిది.సారంగపాణిగా వెలసిన భక్తనందనుడు శయనిస్తూ వేలాది భక్తులను ఆశీర్వదిస్తుంటారు.
అనంతునికి అత్యంత భక్తులైన 12 మంది ఆళ్వారులు నాలాయిర ప్రబంధంలో సారంగపాణిపై అనేక దివ్యగీతాలను రచించారు.
స్థలపురాణం.భృగు మహర్షి వైకుంఠానికి వచ్చిన సమయంలో తనను గమనించలేదన్న కోపంతో ఏకంగా వైకుంఠనాధుని ఛాతీపై కాలితో కొడతాడు.
అయితే భక్త దయాళువు అయిన సుదర్శన ధారి ఏ మాత్రం ఆగ్రహం ప్రదర్శించకుండా అతిధి మర్యాదలు చేస్తాడు.
దీంతో ఆగ్రహించిన అమ్మవారు భూలోకానికి వెళ్లిపోతారు.ఆమెను అన్వేషిస్తూ భక్త వల్లభుడు భూలోకానికి వెళ్లిపోతాడు.
అక్కడే తిరుమల కొండల్లో స్వయంభువుగా అవతరిస్తాడు.కొంత కాలం అనంతరం తన తప్పు మన్నించమని మహర్షి అమ్మవారిని వేడుకుంటాడు.
తన కుమార్తెగా జన్మించాలని కోరుకుంటాడు.దీంతో అమ్మవారు భృగువును తపస్సు చేయాలని ఆదేశిస్తుంది.
దీంతో మహర్షి కుంభకోణం తపస్సు ఆచరించి స్థానికంగా ఉన్న హేమ పుష్కరిణిలో అమ్మవారు చిన్న శిశువుగా ఉండటం చూసి తీసుకువెళ్లి పెంచుకుంటాడు.
అమ్మవారికి కోమల వల్లి అని పేరు పెడతారు.అనంతర కాలంలో అమ్మవారి కోసం వైకుంఠం నుంచి రథంలో స్వామివారు అక్కడకు చేరుకుంటారు.
అనంతరం వారి వారిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు.భూలోకానికి వచ్చే క్రమంలో స్వామి కొన్నాళ్లు భూగర్భంలో ఉంటారు.
వైకుంఠం నుంచి వచ్చే సమయంలో చేతిలో సారంగం అనే విల్లును ధరించి ఉండటంతో సారంగపాణిగా పేరు వచ్చింది.
అప్పడాలు అమ్ముతున్న బుడ్డోడు.. రూ.500 ఇస్తానంటే వద్దన్నాడు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే!