లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ దుర్గారావు ఎంతవరకు చదువుకున్నారో తెలుసా?

సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతోమంది అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని వారిలో ఉన్న టాలెంట్ మొత్తం బయట పెడుతున్నారు.

ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు.

ఇలాంటి వారిలో టిక్ టాక్ దుర్గారావు ఒకరు.టిక్ టాక్ వీడియోలు ద్వారా తన భార్యతో కలిసి డాన్స్ వీడియో లు చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

ఇలా టిక్ టాక్ ద్వారా అతి తక్కువ సమయంలోనే 25 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

ముఖ్యంగా దుర్గారావు తన భార్యతో కలిసి చేసే డాన్సులు ఎంతో ఫేమస్ అయ్యాయి.

ముఖ్యంగా ఈయన తన భార్యతో కలిసి చేసిన నాది నక్కలీసు గొలుసు అనే పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

ఈ డాన్స్ స్టెప్పులను ఏకంగా పలు టీవీ షోలలో కూడా వేసే అంత గుర్తింపు పొందాయి.

ఈ విధంగా గుర్తింపు పొందిన దుర్గారావు ఎన్నో టీవీ షోలలో పాల్గొనడం అలాగే సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గారావు తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

"""/"/ దుర్గారావు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారనీ, ప్రతిరోజు కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించే వాడినని తెలిపారు.

ఇక తన మేనల్లుడు సహాయంతో టిక్ టాక్ వీడియోలు చేయడం ఎలాగో తెలుసుకుని ఇలా టిక్ టాక్ వీడియోలతో అందరికీ పరిచయం అయ్యానని దుర్గారావు తెలిపారు.

మీరు ఎంతవరకు చదువుకున్నారని ప్రశ్నించగా ఆయన సమాధానం చెబుతూ తాను కేవలం రెండవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు.

ఇలా రెండవ తరగతి చదువుకున్న దుర్గారావు తనలో ఉన్న టాలెంట్ తో ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని బిజీగా గడుపుతున్నారు.

నేను చేసిన పెద్ద తప్పు అదే… బండ్ల గణేష్ సంచలన పోస్ట్!