Savitri ANR: ఆ స్టార్ హీరోకి సావిత్రి అంటే చచ్చేంత ఇష్టం.. పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా కాదన్నది..?

భారతీయ సినీ చరిత్రలో మహానటిగా పేరందిన సావిత్రి( Savitri ) దురదృష్టవశాత్తు 46 ఏళ్లకే కన్నుమూసింది.

జెమినీ గణేషన్( Gemini Ganeshan ) తనకు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక ఈ దిగ్గజ నటి కృంగి కృషించి చివరికి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ప్రాణాలను విడిచింది.

లేదంటే ఇప్పటికీ ఆమె బతికే ఉండేది.మహానటి సినిమా తర్వాత ఈ తరం వారికి కూడా సావిత్రి గొప్పతనం తెలిసి వచ్చింది.

ఆమెను ఎప్పటికీ తలుచుకుంటున్నారు.ఆమె గురించి తెలియని విశేషాలను తరచుగా బయటపెడుతున్నారు.

ఇందులో భాగంగా తాజాగా అప్పట్లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ సంఘటనను సీనియర్ సినీ జర్నలిస్టులు తెర మీదకు తెచ్చారు.

"""/" / అప్పట్లో సావిత్రి దేవదాసు సినిమాతో( Devadas Movie ) సూపర్ పాపులర్ అయింది.

ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) హీరోగా నటించారు.

ఆ తర్వాత కూడా మూగమనసులు, సుమంగళి, అర్ధాంగి, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాల్లో సావిత్రి కి ఏఎన్ఆర్ జంటగా నటించారు.

వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో చాలామందిని కట్టిపడేసింది.ఆ నేపథ్యంలోనే ఏఎన్ఆర్ సావిత్రితో గాఢమైన ప్రేమలో పడ్డారని ప్రచారం మొదలైంది.

ఏఎన్ఆర్‌కి సావిత్రి అంటే చచ్చేంత ఇష్టమని, పెళ్లి చేసుకోవాలని ఎంత అడిగినా, అందుకు మాత్రం ఆమె ఒప్పుకోలేదని పుకార్లు షికారు చేశాయి.

"""/" / ఈ ఒక్క పుకారు మాత్రమే కాదు ఏఎన్ఆర్, సావిత్రిలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేసేవి.

ఆ అబద్ధాలన్నీ విని, చూసి విసుకు చెందిన సావిత్రి ఒకరోజు వీటిపై పెదవి విప్పింది.

"ఏఎన్ఆర్, నాకు మధ్య ఏదో ఉందని వస్తున్న ప్రచారాలన్నీ అబద్దమే.ఏఎన్ఆర్ గారు నాకు మంచి స్నేహితులు మాత్రమే.

అంతకుమించి మా మధ్య ఏమీ లేదు.ఇప్పటికీ నమ్మకపోతే అది వారి ఇష్టం" అని క్లారిటీ ఇచ్చింది.

ఈ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్న ఏఎన్ఆర్ ఆమెను సరదాగా ఆటపట్టించే వారట."ఏం సావిత్రి నేను అందంగా లేనా, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు?" అంటూ ఆమెను ఫన్నీగా అడిగేవారట.

ఆ మాటలు విని సావిత్రి నవ్వేసేదట.పెళ్లి కాకముందు ఎంతో సంతోషంగా ఉన్న సావిత్రి ఆ తర్వాత దుఃఖంలో మునిగిపోవడం చూసి ఏఎన్ఆర్ ఎంతో బాధపడేవారట.

ఆమె పరోక్ష మార్గాల్లో ఆర్థిక సహాయం కూడా చేశారట.