తలనొప్పిని తరిమికొట్టే ఈ వంటింటి చిట్కాల గురించి మీకు తెలుసా?

తలనొప్పి( Headache ).వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందర్నీ అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే రుగ్మతల్లో ఒకటి.

తలనొప్పి అనేది చిన్న సమస్యే అయినా.దాని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

తలనొప్పి వచ్చిందంటే చాలు మైండ్ పని చేయడం ఆగిపోతుంది.ఏకాగ్రత దెబ్బతింటుంది.

చిరాకు, కోపం తారస్థాయికి చేరుకుంటాయి.అయితే అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు పాటిస్తే క్షణాల్లో తలనొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు.

"""/" / బ్లాక్ టీ( Black Tea ) తలనొప్పికి చక్కటి ఔష‌దంలా పనిచేస్తుంది.

విపరీతంగా తలనొప్పి వస్తున్నప్పుడు వేడి వేడిగా ఒక కప్పు బ్లాక్ టీ ను తీసుకోండి.

ఇది మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది.ఒత్తిడికి చెక్ పెట్టి తలనొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం రసం, రెండు టేబుల్ స్పూన్లు పుదీనా రసం వేసి బాగా మిక్స్ చేయండి.

ఇప్పుడు ఈ జ్యూస్ ను దూది సహాయంతో నుదిటిపై అప్లై చేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోండి.

ఇలా చేసినా కూడా తలనొప్పి పరారవుతుంది. """/" / -విపరీతమైన తలనొప్పి వస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారి నుంచి కాస్త స్పేస్ తీసుకుని ఒక చీకటి గదిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి.

లేదా ప‌చ్చ‌టి వాతావ‌ర‌ణంలో కాసేపు వాకింగ్ ( Walking )చేయండి.తద్వారా తలనొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా తల నొప్పి నుంచి రిలీఫ్ ను అందిస్తుంది.

అందుకోసం ఒక గ్లాస్ వాటర్ లో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగేయండి.

ఇలా చేస్తే త‌ల‌నొప్పికి ఈజీగా చెక్ పెట్ట‌వ‌చ్చు.ఒక గ్లాస్ పాలల్లో పావు టీ స్పూన్ శొంఠి పొడి, ఒక స్పూన్ పటిక బెల్లం పొడి వేసి మరిగించి తీసుకున్న కూడా తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

ఒంట్లో నీటి శాతం తగ్గినా తలనొప్పి వస్తుంటుంది.కాబట్టి తలనొప్పి ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోండి.

మజ్జిగ, కొబ్బరి నూనె, పుచ్చకాయ జ్యూస్ వంటివి తీసుకున్న కూడా తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

కన్నప్ప సక్సెస్ అయితే క్రెడిట్ ఎవరికి వెళ్తుంది..?