లైంగిక శక్తిని దెబ్బతీసే ఈ ఆహారాలతో జర జాగ్రత్త!
TeluguStop.com
లైంగిక శక్తి లోపించడం.ఈ మధ్య కాలంలో చాలా మంది పురుషులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి వారు వివాహం తర్వాత ఎంతో మానసిక వేదన అనుభవిస్తుంటారు.రొమాంటిక్ లైఫ్‌కు దూరం అవుతారు.
దాంతో సంతాన లేమి, వైవాహిక జీవితం దెబ్బ తినడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా.రకరకాల మందులు వాడతారు.
అయితే లైంగిక శక్తి క్షీణించడానికి చాలా కారణాలు ఉన్నాయి.వాటిలో ఆహారపు అలవాట్లు ఒకటి.
ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల లైంగిక శక్తి దెబ్బ తింటుంది.
కాబట్టి, అటువంటి ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సి ఉంటుంది.మరి ఆ ఆహారాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా బీన్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.అందుకే చాలా మంది దీనిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటారు.
కానీ, హెల్త్‌కు ఎంత మేలు చేసినప్పటికీ.పురుషులు ప్రతి రోజు సోయా బీన్ తీసుకుంటే.
అందులో ఉండే సైటోఈస్ట్రోజెన్ అనే రసాయనం హార్మోన్లపై ప్రభావం చూపి లైంగిక శక్తి తగ్గించేస్తుంది.
"""/" /
అలాగే మైదా పిండితో చేసిన ఆహారాలను ఎంత ఎవైడ్ చేస్తే అంత మంచిది.
మైదాలో ఆరోగ్యాన్ని మరియు లైంగిక సామర్థాన్ని దెబ్బ తీసే విషపూరిత రసాయనాలు అధికంగా ఉంటాయి.
అందువల్ల, మైదాతో తయారు చేసే ఫుడ్స్‌ను ఆహార జాబితా నుండి తొలిగించుకోవాలి.మితంగా తీసుకుంటే.
కాఫీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కానీ, పరిమితికి మించి కాఫీని తీసుకుంటే.
అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టడంతో పాటుగా లైంగిక శక్తి క్షీణించేలా చేస్తుంది.
"""/" /
చాలా మంది రెగ్యులర్‌గా మద్యం తీసుకుంటుంటారు.కానీ, ప్రతి రోజు మద్యం సేవించడం వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ లెవల్స్ తగ్గిపోతాయి.
దాంతో క్రమంగా లైంగిక శక్తిని కోల్పోతుంటారు.ఇక పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ కూడా లైంగిక శక్తిని దెబ్బ తీస్తాయి.
కాబట్టి, వీటికి దూరంగా ఉండాలి.లేదంటే లైఫ్ పాట్నర్‌తో మీ బంధానికి బీటలు వారతాయి జాగ్రత్త.
100 కోట్ల క్లబ్బులో అక్కినేని నాగచైతన్య.. అక్కినేని హీరోల రేంజ్ పెరిగినట్టేనా?