వామ్మో కీర్తి సురేష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా…భారీగా సంపాదించిన నటి?
TeluguStop.com
టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthi Suresh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె మొదట నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాతోనే యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది కీర్తి సురేష్.
ఆ తరువాత తెలుగులో నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారు వారి పాట వంటి సినిమాలలో నటించి మెప్పించింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
"""/" /
ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ చివరగా మహేష్ బాబు( Mahesh Babu )తో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ కాలేక పోయింది.కాగా కీర్తి సురేష్ తాజాగా నటించిన సినిమా దసరా( Dasara )ఈ సినిమాలో హీరోగా నాని ( Nani ) నటించిన విషయం తెలిసిందే.
కాగా నాని కీర్తి సురేష్ కాంబినేషన్ లో వచ్చిన నేను లోకల్ సినిమా సూపర్ హిట్ కాగా, నేను లోకల్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అంతేకాకుండా మొదటిసారిగా నాని ఇందులో మాస్ లుక్ కనిపించనున్నారు.ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో కీర్తి సురేష్ కి ఆస్తులకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
"""/" /
కీర్తి సురేష్ ఆస్తి రూ.35 నుంచి రూ.
40 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం.కాగా సురేష్ ఒక్కో సినిమాకు మొదట్లో 40 లక్షల నుంచి 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది.
స్టార్ హీరోయిన్ అయ్యాక ఒక్కో సినిమాకు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు వసూలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా నటించిన దసరా సినిమా(Dasara Movie) కు గాను ఆమె మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే కీర్తి కొన్ని ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
రిలయన్స్ ట్రెండ్స్, ఉషా ఇంటర్నేషనల్, జోస్ అలుకాస్ వంటి అనేక ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.
ఇందులో ఒక్కో అడ్వర్టైజ్మెంట్ కూడా కీర్తి రూ.15 నుంచి రూ.
30 లక్షలు వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.కీర్తికి తిరుపనంతపురంలో అలాగే చెన్నైలో ఒక విలాసవంతమైన ఇల్లులు కూడా ఉన్నాయట.
అలాగే హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో పోస్ట్ ఏరియాలో ఒక కాస్ట్‌లీ ఇల్లు ఉందట.
అలాగే కీర్తి సురేష్ ఖరీదైన ఆస్తులతో పాటు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్ 7 సీరిస్ ఒకటి.దీని ధర దేశీయ మార్కెట్ లోనే 1.
50 కోట్ల నుంచి 1.78 కోట్ల వరకు ఉంటుంది.
అలాగే మెన్స్ డేస్, బెంజ్, టయోటా, ఇన్నోవా, క్రిస్టా లాంటి కార్లు కూడా కీర్తి ఖాతాలో ఉన్నాయి.
వీటి ధర కోట్లలో ఉంటుందని అంచనా.
ద్రోహి వచ్చేశాడు చూడండి.. ధోని అంతమాట అనేశాడేంటి? వైరల్ వీడియో