తారకరత్నకు వచ్చిన మెలెనా వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసా?

నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఆయనకు చికిత్స జరుగుతుంది ప్రస్తుతం ఈయన పరిస్థితి కాస్త విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

గుండెపోటు రావడంతో తారకరత్నను నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు అయితే అక్కడ తారకరత్నను పరీక్షించిన వైద్యులు ఈయన మెలెనా అనే వ్యాధితో బాధపడుతున్నారని ప్రకటించారు.

ఈ వ్యాధితో బాధపడే వారు జీర్ణాశయం లోపల, అన్నవాహిక, పొట్ట భాగంలో అధిక రక్తస్రావం జరుగుతుందని వైద్యులు తెలిపారు.

"""/"/ ఈ వ్యాధి కారణంగా రక్త స్థాయిలో పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు తెలిపారు.

ఈ వ్యాధి జీర్ణాశయం దెబ్బతినడం, కడుపులో పుండ్లు ఏర్పడడం, అధిక యాసిడ్ ఉత్పత్తి కావడం, రక్తనాళాలలో వాపు కారణంగా ఏర్పడుతుంది.

ఈ వ్యాధి వచ్చిన వారిలోరక్త స్థాయి పూర్తిగా తగ్గిపోయి రక్తహీనత సమస్యతో బాధపడతారు.

కొన్నిసార్లు ఈ వ్యాధి అనీమియాకి కూడా దారి తీయవచ్చు.ఈ వ్యాధితో బాధపడే వారిలో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది.

శరీరం రంగు మారిపోవడం, తొందరగా అలసిపోయి నీరసించి పోవడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి.

"""/"/ రక్త ప్రసరణ స్థాయి తగ్గిపోయినప్పుడు పొత్తికడుపులో నొప్పి కలగడం, అజీర్తి, చిన్నప్రేగులో రక్తస్రావం కావడం వాంతులు అవడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఇక ఈ వ్యాధితో బాధపడే వారికి పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్ తో పాటు ఎండోస్కోపీ థెరపీ, సర్జికల్ థెరపీ, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, రక్తమార్పిడి చికిత్సలు చేస్తారు.

ప్రస్తుతం తారకరత్న కూడా ఇలాంటి వ్యాధితో బాధపడటంతో ఈయన గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కష్టంగా అవుతుండడంతో.

బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా గుండె నాళాల్లోకి రక్తాన్ని పంపిణీ చేయడం కోసం వైద్యులు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి తారకరత్న ఆరోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉందని తెలుస్తుంది.

ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా బెంగళూరుకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

మరి కాసేపట్లో ఎన్టీఆర్ కూడా బెంగళూరు చేరుకోనున్నారు.

రవితేజ నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ వచ్చినట్టేనా..?