ధర్మపురిలో యమధర్మరాజుకు దేవాలయం.. ఈ దేవాలయం విశిష్టత ఏమిటో తెలుసా..?

ధర్మపురి( Dharmapuri ) పేరు వింటేనే రెండు విశిష్టతలు గుర్తుకొస్తూ ఉంటాయి.ఒకటి దక్షిణావి ముఖంగా ప్రవహించే పవిత్ర గోదావరి.

రెండు యోగనృసింహ స్వామి.అయితే ధర్మపురి లో మరో ప్రత్యేకత ఉంది.

అదే మన ప్రాణాలను హరించే యముడికి ఆలయం.ఎక్కడా లేని విధంగా ధర్మపురిలో మాత్రమే యముడు దేవాలయం( Yamadharmaraj Temple ) ఎందుకు వెలిసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

నరకం అంటే పాపం.పాపం చేస్తే పోయేది నరకం.

అలాంటి నరకంలో నిత్యం పాపులతో గడిపే యముడికి మనశ్శాంతి కరువైంది.అప్పటికే అప్పటికే హిరణ్యకశిపుడిని సంహరించి ఉగ్రరూపంలో ఉన్న నరసింహుడు ప్రహ్లాదుడి అర్చనతో శాంతించి యోగ రూపంలోకి మారి కొలువైన చోటే ధర్మపురి అనే విశిష్టత ఈ క్షేత్రానికి ఉంది.

"""/" / అదే సమయంలో బ్రహ్మది దేవతలు, ఋషులు, మునులతో కలిసి ధర్మపురిలో ఎక్కడ లేని విధంగా దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరిలో స్నానమాచరించి ఆ యోగ నరసింహుడి దర్శనంతో( Narasimha Swamy ) పునీతులయ్యారనీ ధర్మపురి స్థల పురాణాల గురించి స్థానికులు చెబుతున్నారు.

అంత మంది దేవతలు కూడా ఆ నరసింహుడిని దర్శించి పునీతులవ్వడంతో యముడిలోనూ ఆ ధర్మపురి గురించి ఆలోచనలు మొదలయ్యాయి.

నిత్యం నరకానికి వచ్చే పాపులను చూస్తూ వారు చేసిన నేరాలు గురించి వింటూ వారికి వివిధ రకాల శిక్షలు విధిస్తూ మనశ్శాంతి కరువైన యముడు వాటన్నిటి నుంచి దూరమై ఆ నరసింహుడి దర్శనంతో పునీతుడు అయ్యేందుకు ధర్మపురికి వచ్చాడని పురాణాలలో ఉంది.

"""/" / అలాగే ఎన్నో యాత్రలు చేసుకుని చివరికి ధర్మపురి పుణ్య గోదావరిలో( Godavari ) స్నానమాచరించి ఆ తర్వాత యోగ నరసింహుడిని దర్శించుకున్న యముడికి అంతవరకు పాపాత్ములకు శిక్షలతో పట్టుకున్న దోషాలు, మానసిక శాంతి వంటివన్నీ దూరమయ్యాయని బ్రహ్మాండ, స్కాంధ పురాణాలు చెబుతున్నాయి.

యోగా లక్ష్మీనృసింహుడి దర్శనం కంటే ముందు మనకు ధర్మపురి దేవాలయంలో యముడి దేవాలయం కనిపిస్తుంది.

పెద్ద పెద్ద కోరలతో చేతులతో యమదండంతో భీకరంగా ఉన్న యముడి విగ్రహం కనిపిస్తుంది.

ఈ క్రమంలో ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదనే నానుడి స్థిరపడింది.

అలాంటి వాళ్లకు మాత్రమే పవన్ గుండెల్లో స్థానం.. ఎస్జే సూర్య క్రేజీ కామెంట్స్ వైరల్!