గంట ఆలయం ఎక్కడ ఉంది.. ఈ ఆలయ విశిష్టత ఏమిటో తెలుసా?

మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు.ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువై ఉన్నాయి.

ఈ విధంగా కొలువై ఉన్న ఆలయాలలో ఎన్నో వింతలు, రహస్యాలు దాగి ఉన్నాయి.

ఇప్పటికీ ఆ రహస్యాలు వెనుక కారణాలను నిపుణులు చేదించలేకపోతున్నారు.ఈ విధంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే ఆలయాలలో గంట ఆలయం ఒకటి.

వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి.

మరి ఈ గంట ఆలయం విశిష్టతలు, విశేషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా, సంతరావురు అనే గ్రామంలో పార్వతీ సమేతంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువై ఉండి భక్తులను దర్శనమిస్తున్నారు.

ఇక్కడ ఆలయంలో వెలసిన స్వామివారు స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.సాధారణంగా ఏ ఆలయంలోనైనా శివలింగానికి ఎదురుగా మనకు ఒక నంది మాత్రమే దర్శనం ఇస్తుంది.

కానీ అన్ని ఆలయాల కంటే ఈ ఆలయం ఎంతో భిన్నమైనది.ఈ ఆలయంలో స్వామివారి లింగానికి ఎదురుగా రెండు నందులు దర్శనమిస్తాయి.

అదేవిధంగా గర్భగుడిలో స్వామివారికి ఎదురుగా వెలిగించిన దీపాన్ని ఈ రెండు నందులు చూసే విధంగా ఆలయ నిర్మాణాన్ని ఎంతో అద్భుతంగా చేపట్టారు.

ముఖ్యంగా ఈ ఆలయం గురించి చెప్పుకోవాల్సిన విషయానికి వస్తే ఈ ఆలయంలో ఉన్నటువంటి గంట ఎంతో ప్రత్యేకమైనది.

"""/" /మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఒకసారి గంట మోగిస్తే మనకు రెండు మూడు సార్లు ఆ గంట ప్రతిధ్వని వినిపిస్తుంది.

కానీ ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలోనికి వెళ్లి ఒక్కసారి గంట మోగిస్తే 108 సార్లు ప్రతిధ్వనిస్తుంది.

ఎంతో విశిష్టత కలిగిన ఈ గంట నుంచి మనం ఓంకారం శబ్దాన్ని స్పష్టంగా వినవచ్చు.

ఈ విధంగా గంటనుంచి ఓం కారం శబ్దం కాశీ విశ్వనాధుని ఆలయంలో వినవచ్చు.

ఆ తరువాత ఈ రామలింగేశ్వరాలయంలో మాత్రమే ఓంకార శబ్దాన్ని వినగలము.ఈ విధంగా ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు దాగి ఉన్నాయి.

ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయానికి భక్తులు కార్తీకమాసం, శివరాత్రి, మాఘమాసం వంటి నెలలో పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు.

మాళ్వి మల్హోత్రా స్పెషల్ సాంగ్ షాబానో విడుదల !!!