కోటప్పకొండపై ఉండే త్రికోటేశ్వర స్వామి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్య క్షేత్రమే కోటప్పకొండ.సృష్టికర్త బ్రహ్మ దేవునికి జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతి చెందుతూ వస్తోంది ఈ కోటప్పకొండ.

'చేదుకో కోటయ్య.మమ్మాదుకోవయ్యా.

!! అంటూ యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలు అందుకునే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది.

మహాశివరాత్రి పర్వదినాల్లో అత్యంత భక్తజనంతో నిండిపోతుంది.h3 Class=subheader-styleఆలయ చరిత్ర.

/h3p దీనికి కచ్చితమైన ఆధారాలేమి లేకపోయినప్పటికీ శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని క్రీ.

శ 1172లో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు కూరి విరాళాలు ఇచ్చారని శాసనాలు తెలుపుతున్నాయి.

కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు.త్రికోటీశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది.

ఈ కొండను ఏ కోణం నుంచి చూసిన మూడు శిఖరాలు కనబడుతుంటాయి.అందుకే దీనికి త్రికూటాచలమనే పేరు వచ్చింది.

ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు.h3 Class=subheader-styleపురాణ కథనం.

/h3p శివుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత బాలదక్షిణామూర్తి అవతారంలో బాలునిగా మారి కైలాసంలో కఠిన తపస్సును ఆచరిస్తూంటాడు.

ఆ సమయంలో బ్రహ్మ.దేవతలందరితో కలిసి దక్షిణామూర్తిని సందరిస్తాడు.

స్వామి వారిని మాకు జ్ఞానభోద చేయమని వేడుకుంటారు.అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు.

అప్పుడు బ్రహ్మతో పాటు ఇతర దేవతలందరు కూడా త్రికూటాచలానికి వస్తారు.అప్పుడు శివుడు త్రికూట కొండపైనే వెలసి వారందరికి జ్ఞానోపదేశాన్ని బోధిస్తాడు.

ఆ ప్రదేశంలో ఉన్న గుడికే పాత కోటప్పగుడి అని పేరు వచ్చింది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటన.. బీఆర్ఎస్ సభకు హాజరు