ఆంజనేయుడి జన్మరహస్యం ఏమిటో తెలుసా?
TeluguStop.com

భక్తుల మనసులోని భయాల్ని పారద్రోలే ఆంజనేయ స్వామి జన్మ రహస్యం మీకు తెలుసా.


గత జన్మలో ఆంజనేయ స్వామి ఏ అవతారంలో పుట్టాడో, అలాగే రామాయణంలో సీతాన్వేషణకు సుందర కాండ అని పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం.


త్రిపురాసుర సంహారంలో పరమ శివుడు విష్ణువు సహకారం తీసుకున్నాడు. అందుకు రావణ సంహారంలో విష్ణు అవతారమైన శ్రీ రాముడికి సహకరించాడని పరాశర సంహిత చెబుతోంది.
ఒకరి నుంచి ఉపకారం పొందిన వారెవరైనా కృతజ్ఞతతో మెలగాలన్నదే ఆంజనేయుడి జన్మలోని సందేశం.
వాల్మీకి రామాయణం ప్రకారం పుంజిక స్థల అనే అప్సరస బృహస్పతి శాపం వల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరునికి జన్మించింది.
"""/" /
ఆమెకు కుంజరుడు అంజనా దేవి అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత అతడు కేసరికి తన కూతురు అంజనా దేవిని ఇచ్చి వివాహం జరిపించాడు.
వారిద్దరికీ పుట్టిన వాడే ఆంజనేయ స్వామి. హనుమంతుని జన్మ రామేశ్వరులను అనుసంధానించింది కనుక రామేశ్వరం వద్ద రామసేతు నిర్మాణానికి కూడా హేతువైంది.
హనుమ అసలు పేరు సుందరుడు కనుకే వాల్మీకి సీతాన్వేషణ కాండకు సుందర కాండమని పేరు పెట్టాడు.
అంతే కాదు ఆంజనేయ స్వామికి మరిన్ని పేర్లు కూడా ఉన్నాయి. హనుమ, కేసరీ నందన, వాయు పుత్ర, ఆంజనేయుడు, బజరంగీ, పవన తనయ, అంజనీ సుతుడుగా పిలుస్తారు.
అలాగే ఎవరికి ఎలాంటి భయాలు కల్గినా ఆంజనేయ స్వామి దండకం చదివితే మనసులోని భయాలు పోయి మనశ్శాంతి దొరుకుతుందట.
ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల లాభమా? నష్టమా?