ఊర్మిళాదేవి నిద్ర వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా..?
TeluguStop.com
రామాయణంలో స్త్రీ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.జనకమహారాజు కూతురు అయిన సీతాదేవి స్వయంవరంలో శివధనస్సును పెకిలించి సీతాదేవిని శ్రీరామచంద్రుడు పెళ్ళాడతాడనే విషయం మనకు తెలిసిందే.
ఈ తరుణంలోనే సీత చెల్లెలైన ఊర్మిళాదేవికి రాముడి తమ్ముడైన లక్ష్మణుడు కూడా వివాహం జరుగుతుంది.
పెళ్లయిన కొద్ది రోజులకే జనకమహారాజు శ్రీరామచంద్రుని అరణ్యవాసం చేయాల్సిందిగా కోరుతాడు.తండ్రి మాటను జవదాటని రాముడు అరణ్యవాసం చేయడానికి బయలుదేరుతున్న సమయంలో సీతాదేవి శ్రీరాముడు ఎక్కడుంటే సీతాదేవి కూడా అక్కడే ఉంటుందని తెలియజేసి అరణ్యవాసం వెళ్ళడానికి బయలుదేరుతారు.
అప్పుడు అన్నా, వదిన రక్షణ కోసం తాను కూడా అరణ్యవాసం వెళ్తానని లక్ష్మణుడు వారి వెంట బయలుదేరుతాడు.
అదే సమయంలో ఊర్మిళాదేవి కూడా తనతోపాటు వస్తానని చెప్పగా అందుకు లక్ష్మణుడు ఇక్కడే ఉండి తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సినదిగా తెలియజేస్తాడు.
దాంతో ఊర్మిళాదేవి అయోధ్యలో ఉండి 14 సంవత్సరాలపాటు నిద్రలోకి వెళ్ళడం గురించి మనకు తెలిసిందే.
అయితే 14 సంవత్సరాల పాటు ఊర్మిళాదేవి నిద్ర పోవడానికి గల కారణం ఇక్కడ తెలుసుకుందాం.
లక్ష్మణుడి మాటను జవదాటకుండా ఊర్మిళాదేవి అయోధ్యలో ఉండి శ్రీరామచంద్రులు 14 సంవత్సరాలు వనవాసం చేసి వచ్చే వరకు నిద్రలోకి వెళుతుంది.
అరణ్యంలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో తన బాధ్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా, తనకు 14 సంవత్సరాల పాటు నిద్ర రాకుండా విడిచిపెట్టమని ఆ నిద్ర దేవతను వేడుకుంటాడు.
అయితే నిద్ర ప్రకృతి ధర్మమని తనకు రావాల్సిన నిద్ర మరెవరికైనా పంచాలని కోరడంతో,తన 14 సంవత్సరాల పాటు నిద్రను తన భార్య ఊర్మిళాదేవికి ప్రసాదించమని లక్ష్మణుడు నిద్రాదేవతను కోరుతాడు.
ఆ విధంగా సీతారామలక్ష్మణులు వనవాసం చేసిన 14 సంవత్సరాలు పాటు ఊర్మిళాదేవి అయోధ్యలో నిద్రపోతుంటారు.
చివరకు వనవాసం ముగించుకొని అయోధ్య చేరుకునే సమయానికి ఊర్మిళాదేవి నిద్ర లేస్తుంది.14 సంవత్సరాల పాటు నిద్ర పోతున్న ఊర్మిళాదేవిని ఊర్మిళాదేవి నిద్ర అని పిలుస్తారు.